BREAKING
అర్థవంతమైన విద్యతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి : టీటీడీ ఈఓ అక్టోబర్ 9న థియేటర్లలోకి సూరి, నివిన్ పౌలీల క్రేజీ డబ్బింగ్ మూవీ 'సప్తసాగరాలు సప్తగిరులు'! పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ ఆర్ట్స్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన రాష్ట్రస్థాయి పోటీలకు చిన్మయి ఎంపిక. జూబ్లీహిల్స్‌లో అరుదైన ఆభరణాల ప్రదర్శన.. 'ది ట్రెజర్ చెస్ట్'ను ప్రారంభించిన అల్లు స్నేహా రెడ్డి! ఛాతీ తెరవకుండానే చీలిన ప్రధాన రక్తనాళానికి చికిత్స 15 నిమిషాల పాటు శ్వాస ఆపి అందరినీ ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్! అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మృతుడి కుటుంబానికి రూ.1.14 కోట్ల బీమా రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రేపల్లె బ్లడ్ బ్యాంక్ సందర్శన పిట్టలవాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ - ఎస్పీ అఖిల్ మహాజన్ లిప్స్ 39 మద్యం దుకాణాలకు లాటరీ నేడు అనంతపురం కలెక్టర్ సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్ ఉదయం 7.30 గంటల్లోపు అర్హత కలిగిన దరఖాస్తుదారులు హాజరు కావాలి అందరి చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా 'సమ్మర్ హాలిడేస్' నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుదల! రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా

కావలిలో జనసేనలో చేరిన వైసీపీ వాలంటీర్లు, నాయకులు

Select Suryaa Now
కావలిలో జనసేనలో చేరిన వైసీపీ వాలంటీర్లు, నాయకులు

 కావలి,మేజర్ న్యూస్ :  పట్టణంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, వార్డు వాలంటీర్లు బుధవారం జనసేన పార్టీలో చేరారు.  పట్టణంలోని 1, 16, 18వ వార్డులకు చెందిన వైసీపీ వాలంటీర్లు వీరనారాయణమ్మ, కొండా కవిత, మాకన విజయంలో పాటు వైసీపీ సోషల్ మీడియా వింగ్ సెక్రటరీ ఆళ్ల శ్రీనివాసులు, నాయకులు కొండా మస్తాన్, షేక్ కరీముల్లా తదితరులు జనసేనలో చేరారు.  జనసేన నాయకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వీరందరికీ ఆయన జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా మన్నెమాల సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.   పార్టీలో చేరిన నాయకులు, మాతృసంస్థలు, పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు, మన్నెమాల సుకుమార్ రెడ్డి నాయకత్వంలో కావలిలో జనసేన పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.