telanagana
అక్రమంగా టేకు కలప తరలింపు.. ట్రాక్టర్ పట్టివేత - కలప విలువ రూ.5,9000.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సరోజినీ రాణి
సూర్య తిర్యాణి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని గిన్నెధరి రేంజ్ పరిధి నుంచి ఆసిఫాబాద్‌కు అక్రమంగా టేకు కలపను ట్రాక్టర్‌లో తరలిస్తుండగా అటవీ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న టేకు కలప విలువ సుమారు రూ.5,9000 ఉంటుందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సరోజినీ రాణి తెలిపారు. మిట్ట వెంకటేశం అనే వ్యక్తి గిన్నెధరి ప్రాంతం నుంచి ఆసిఫాబాద్ వైపు ట్రాక్టర్‌లో టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన అటవీ అధికారులు ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశం ఒకవైపు ఇందిరమ్మ ఇళ్ల కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ, మరోవైపు అక్రమంగా టేకు కలపను రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సరోజినీ రాణి మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల నుంచి అనుమతులు లేకుండా కలపను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీ సంపదను కాపాడేందుకు అక్రమ కలప రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై అటవీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.