BREAKING
శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కొత్త చిత్రం హైకూ ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! జోగింపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో ఎస్ అవినాష్ అయోడిన్ లోపంతో పిల్లల ఎదుగుదలపై ప్రభావం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం వరిలో ఎద పద్ధతితో సాగు ఖర్చు తగ్గుతుంది ... ఏవో ఎస్ అవినాష్.

అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు

Select Suryaa Now
అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు
జగిత్యాల ప్రతినిధి ;స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బాల మాయ దేవి అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, అనర్హులైన లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పేర్లపై చట్టబద్ధమైన విధానాలను అనుసరిస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బాల మాయ దేవి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బాల మాయ దేవి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. హెల్ప్‌డెస్క్‌ల వద్దకు వచ్చే ఓటర్లకు దరఖాస్తుల విధానం, అవసరమైన పత్రాలు, నోటీసులకు సంబంధించిన వివరాలను స్పష్టంగా తెలియజేసి, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని సూచించారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఇప్పటివరకు సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని అభినందించారు. అలాగే మిగిలిన 30 శాతం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని  సూచించారు. రానున్న దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో చివరి నిమిషంలో పనులపై ఒత్తిడి పెరగకుండా ముందస్తు ప్రణాళికతో పనులను వేగవంతం చేయాలని తెలిపారు. చివరి నిమిషంలో హడావుడిగా పనులు చేపట్టడం వల్ల పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నందున ముందుగానే పెండింగ్ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సూపర్వైజర్లు, బీఎల్‌ఓలతో అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. బీఎల్‌ఓలతో పాటు బూత్ లెవల్ ఏజెంట్ల భాగస్వామ్యంతో ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి, నరసింహరావు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ఎన్నికల అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.