telanagana
అంగన్వాడీ, పాఠశాలలను పరిశీలించిన ఎంపీడీవో.
సూర్య, నాగిరెడ్డి పేట్;మండలంలోని, ఆత్మకూర్ గ్రామంలో మంగళవారం ఎంపీడీవో గంగాధర్ అంగన్వాడీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థుల హాజరు, రికార్డులు, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి. మెనూ తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి సకాలంలో బిల్లులను పొందాలని, నిర్మాణాలు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, అంగన్వాడి టీచర్లు, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి స్రవంతి,తదితరులు పాల్గొన్నారు.