మకర రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
మకర రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
♑మకర రాశి... ప్రారంభంలో పట్టుదల, శ్రమతో వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు సాధిస్తారు. ఆర్థిక, కమ్యూనికేషన్ అనుకూలం. ముఖ్యంగా భాగస్వామి, సజ్జన సహకారం, పెద్దల ఆశీస్సులతో, దూరంగా ఉన్న తోబుట్టువుల చర్చలతో ప్రణాళికతో భూ వ్యవహారాలలో ముందుకు వెళతారు. స్థిరాస్తులు, గృహ, సంతాన విద్య, మాతృ విషయాలలో కీలక నిర్ణయాలు. నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ. మధ్యలో ఆత్మీయులతో విందు వినోదాల్లో, కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల సహకారం. కుటుంబము, ముఖ్యంగా సంతానానికి వృత్తిలో శ్రమకి తగిన గుర్తింపు, నూతన అవకాశాలు. ఉన్నతస్థాయి వ్యక్తుల సహకారం. సృజనాత్మకత బాగుంటుంది. వారాంతం పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి. వృత్తిలో పలుకుబడి కల పెద్దల సహకారం. మాట విలువ, ఆర్థిక అంశాలు ప్రయోజనకరం. గణేశారాధన మేలు.