BREAKING
పీఏసీఎస్‌ల సమస్యల పరిష్కారానికి చర్యలు పులి పాదముద్రల గుర్తింపు బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు. జిల్లా మెడికల్ అధికారిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి* అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి: పెదవేగి వైద్యాధికారి కార్తీక్ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ

విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఆహ్వానం

Select Suryaa Now
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఆహ్వానం

సూర్య ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'విజయవాడ ఉత్సవ్ 2.0'తో పాటు ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరిగే విజయవాడ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ సి. జోసెఫ్ విజయ్‌కు సాదర ఆహ్వానం అందింది. ఏపీకి చెందిన పార్లమెంట్ సభ్యుల బృందం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేసింది.

ఈ సందర్భంగా విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని, ఆధ్యాత్మిక విశిష్టతను చాటిచెప్పేలా అక్టోబర్ నెలలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ 2.0 ఏర్పాట్లను ఎంపీలు సీఎం విజయ్‌కు వివరించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ నగరంలో కృష్ణా నదీ తీర ప్రాంతాలు, వివిధ వేదికల్లో భారీ సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు మరియు వైవిధ్యభరిత వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడుతో ఉన్న సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఉత్సవాలకు విచ్చేయాలని వారు ప్రత్యేకంగా కోరారు.

ఆహ్వానం పట్ల తమిళనాడు సీఎం విజయ్ హర్షం వ్యక్తం చేస్తూ, విజయవాడ ఉత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఉత్సవాలకు హాజరయ్యే అంశంపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎంపీల బృందం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చేలా విజయవాడ కార్నివాల్ వేడుకలను కూటమి ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దుతోందని నేతలు పేర్కొన్నారు.