వీఆర్ఏ వెంకటేశ్వరరావు ఆకస్మిక మృతి
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలో గ్రామ రెవెన్యూ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు (వెంకటేష్) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన అకస్మిక మృతి పట్ల భట్టిప్రోలు మండల తహసీల్దార్ జి. నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు.వెంకటేశ్వరరావు మరణవార్త తెలిసిన వెంటనే తహసీల్దార్ నాగరాజు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలిపారు. ఈ కష్టసమయంలో వెంకటేశ్వరరావు కుటుంబానికి రెవెన్యూ శాఖ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఆయన మృతి పట్ల మండలంలోని వీఆర్ఏలు, వీఆర్వో లు మరియు మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో వెంకటేశ్వరరావు ప్రదర్శించిన అంకితభావం, అందరితో పని చేశారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.