వైయస్సార్ గూటికి పలు కుటుంబాలు
ఆమదాలవలస, సూర్య : బూర్జ మండలం మామిడివలస పంచాయతీ ఖకండ్యం, చీడివలస పంచాయతీ గంగంపేట గ్రామాలకు చెందిన 15 మంది టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి శుక్రవారం అందాల వలస పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చింతాడ రవికుమార్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ నాయకత్వంపై విశ్వాసంతో వీరు పార్టీలో చేరినట్లుఈ సందర్భంగా వారు తెలియజేశారు. పార్టీలో చేరిన వారిలో జాగుపల్లి వెంకటేష్, పైల మోహన్ రావు, గొల్లి గోవింద రావు , పోలసారి రాంబాబు, పైలా నాగరాజు, బొడ్డ గోవింద, నినగుప్పల పోతయ్య, చొక్కర రాము తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో బూర్జ మండల అధ్యక్షులు కాండపు గోవిందరావు, సాకేటి శ్రీను, బొల్లూ సాంబమూర్తి, బొల్లు సూరిబాబు, జాగుపల్లి దళినాయుడు, పందిరి వెంకట్రావు, చంద్రపురి నీలం, జాగుపల్లి మధుసూదన్ రావు, సంభాన వీరస్వామి, కొబగాన రామకృష్ణ, మామిడి గౌరీ నాయుడు, బొత్స లక్ష్మణరావు, చొక్కార జనార్దన్ రావు, పొలసరి త్రినాథ్, పాలవలస దుర్గారావు, మామిడి వెంకటరమణ,బూరి గణేష్, గడిదేసి అప్పలనాయుడు, జగ్గుపల్లి ఉమా తదితరులు పాల్గొన్నారు.