ఉండిలో వైసిపి జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థుల విస్తృత ప్రచారం
ఉండి, మేజర్ న్యూస్:ఉండి మండలం పెదపుల్లేరు, చినపుల్లేరు గ్రామాల్లో వైసిపి జెడ్పిటిసి అభ్యర్థి వర్రె పైడియా, పెదపుల్లేరు ఎంపీటీసీ అభ్యర్థి పాటూరి శ్రీనివాస దొరబాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆదివారం వైసీపీ శ్రేణులు వారి వెంట రాగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు ఆదివారం కావడంతో పలు చర్చిలకు సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఓటర్లను ఓట్లు అభ్యర్థించడంతోపాటు తమ గెలుపు కొరకు చర్చి పాస్టర్లతో ప్రత్యేక ప్రార్థనలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని ఆ వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని ఎక్కడికి వెళ్లిన ప్రజలు వైసీపీ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని వారు అన్నారు మాజీ సీఎం జగన్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తమ గెలుపుకు నాంది పలుకుతాయని ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజల అండదండలతో ముందుకు వెళుతున్నామని ఓటర్లు ఆ విషయాన్ని గ్రహించి తమకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు వైయస్ జగన్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వారు అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటే అని పేద మధ్య తరగతి ప్రజలు ధరలతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు మండిపడ్డారు. ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో బడుగు బాలాజీ, రాయి సతీష్, దొండా రమేష్, గుల్లిపల్లి అచ్చారావు, తదితర నాయకులు కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని వైసీపీ అభ్యర్థులు తరఫున ఓటర్లను ఓట్ల అభ్యర్థించారు.