పొన్నూరులో జెడ్పీటీసీఓట్ల లెక్కింపు పై సిబ్బందికిశిక్షణ కార్యక్రమం
పొన్నూరున్యూస్ :పొన్నూరుమండల జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు కౌంటింగ్ సిబ్బందికి పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలోని చింతలపూడి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్-1, కౌంటింగ్ అసిస్టెంట్-2లకు శిక్షణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని రిటర్నింగ్అధికారి, పొన్నూరు ఎంపీడీఓ సందర్శించి పరిశీలించారు. ఓట్ల లెక్కింపు విధానం, బ్యాలెట్ పత్రాల పరిశీలన, చెల్లుబాటయ్యే, చెల్లని ఓట్ల గుర్తింపు, కౌంటింగ్ సమయంలో పాటించాల్సిన నిబంధనలు, కౌంటింగ్ రికార్డుల నిర్వహణ, ఫలితాల నమోదు తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.లెక్కింపుసమయంలో ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతాయుతంగానిర్వహించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని రిటర్నింగ్అధికారి ఎంపీడీఓ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలోకౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, సంబంధిత ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.