పోలాకిలో టీడీపీకి మరో షాక్..
- వైఎస్సార్‌సీపీలోకి 10 కుటుంబాలు చేరిక.
- గంగివలసలో ధర్మాన కృష్ణ చైతన్య సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ కార్యకర్తలు.
పోలాకి అక్టోబర్ 31 మేజర్ న్యూస్ : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం గంగివలస గ్రామంలో టీడీపీకి చెందిన పది కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పాసిన ప్రభాకర్ రావు, కొర్రాయి కృష్ణమూర్తి, బర్ల అప్పన్న, పల్ల రమణ, పాసిన మల్లేష్ తదితరులు తమ కుటుంబాలతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు.ఈ సందర్భంగా యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి జరుగుతున్న చేరికలు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఐక్యంగా కూటమి ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేయాలని పిలుపునిచ్చారు.
రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల రైతు విభాగం అధ్యక్షుడు ఏడూరి శ్రీధర్, మండల యువజన విభాగం ఉపాధ్యక్షుడు పాసిన రమణ, నీలాపు ఆసిరి నాయుడు, పాసిన ఎర్రంనాయుడు తదితరులు పాల్గొన్నారు. గంగివలసలో జరిగిన ఈ చేరికలతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.