పశ్చిమ జోన్ ప్రీ-రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్‌నకు నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థిని ఎంపిక
నెల్లూరు కల్చరల్, మేజర్ న్యూస్ : నారాయణ మెడికల్ కాలేజీ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) విభాగానికి అరుదైన జాతీయ గౌరవం లభించింది. కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్ కుమారి ఎ. వైదేహి ప్రతిష్ఠాత్మకమైన పశ్చిమ జోన్ ప్రీ-రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్–2026కు ఎంపికయ్యారు. అలాగే కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి.ఎం. కార్తీక్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఎస్ఎస్ బృందానికి కంటింజెంట్ లీడర్‌గా నియమిస్తూ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని హైదరాబాద్ ఎన్ఎస్ఎస్ ప్రాంతీయ సంచాలక కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రతిష్ఠాత్మక శిక్షణా శిబిరం తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని వెంకటాపూర్‌లో ఉన్న అనురాగ్ యూనివర్సిటీ వేదికగా ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. ఈ జాతీయ స్థాయి శిబిరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాలతో పాటు డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఉత్తమ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కళాశాల డీన్ డాక్టర్ పి. శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ స్థాయి శిబిరానికి వాలంటీర్ వైదేహి ఎంపిక కావడం, రాష్ట్ర బృందానికి డాక్టర్ కార్తీక్ నాయకత్వం వహించడం తమ కళాశాలకు ఎంతో గర్వకారణమని కొనియాడారు.ఈ సమావేశంలో కళాశాల డీన్ డాక్టర్ పి. శ్రీనివాసులు రెడ్డితో పాటు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. విశ్వకుమార్, విజువల్ కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ విభాగాధిపతి ఏ.సి. శేఖర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి.ఎం. కార్తీక్, వాలంటీర్ కుమారి ఎ. వైదేహి పాల్గొన్నారు.