BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

నెల్లూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీల్లో నవంబర్ 1న పోలింగ్

Select Suryaa Now
నెల్లూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీల్లో నవంబర్ 1న పోలింగ్

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   జిల్లాలోని నెల్లూరు నగరపాలక సంస్థ, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలకు నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న  ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

మొత్తం 5,52,318 మంది ఓటర్లు

జిల్లాలోని నెల్లూరు, ఆత్మకూరు, బుచ్చి మూడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 128 వార్డులు ఉండగా, 594 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో మొత్తం 5,52,318 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2,68,309 మంది పురుషులు, 2,83,921 మంది మహిళలు, 88 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.  మున్సిపాలిటీల వారీగా వివరాలు పరిశీలిస్తే నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 72 వార్డులు, 509 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 2,37,972 మంది పురుషులు, 2,51,293 మంది మహిళలు, 86 మంది ఇతరులు కలిపి మొత్తం 4,89,351 మంది ఓటర్లు ఉన్నారు.  ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులు, 30 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 12,654 మంది పురుషులు, 13,875 మంది మహిళలు కలిపి మొత్తం 26,529 మంది ఓటర్లు ఉన్నారు.  బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులు, 55 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 17,683 మంది పురుషులు, 18,753 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు కలిపి మొత్తం 36,438 మంది ఓటర్లు ఉన్నారు.

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు 

ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక, సాధారణ కేంద్రాలుగా గుర్తించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 594 పోలింగ్ కేంద్రాల్లో 52 అత్యంత సున్నిత, 200 సున్నిత, 342 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా వర్గీకరించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 52 అత్యంత సున్నిత, 174 సున్నిత, 283 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆత్మకూరులో 30 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉండగా, బుచ్చిరెడ్డిపాళెంలో 26 సున్నిత, 29 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

4,351 మంది పోలింగ్ సిబ్బంది నియామకం

పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు మొత్తం 4,351 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 713 మంది ప్రిసైడింగ్ అధికారులు (PO), 713 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (APO), 2,851 మంది ఇతర పోలింగ్ అధికారులు (OPO), 74 మంది మైక్రో అబ్జర్వర్లు (MO) ఉన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 3,720 మంది, ఆత్మకూరు మున్సిపాలిటీలో 230 మంది, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో 401 మంది సిబ్బందిని పోలింగ్ విధులకు కేటాయించారు.

ఎన్నికల బందోబస్తుకు 1,725 మంది పోలీసు సిబ్బంది

పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లావ్యాప్తంగా 1,725 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో 31 మంది సీఐలు, 88 మంది ఎస్సైలు, 346 మంది ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుళ్లు, 897 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 363 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు.

115 వాహనాల ఏర్పాటు.. 82 బస్సులు వినియోగం

ఎన్నికల విధుల నిర్వహణ, పోలింగ్ సిబ్బంది రవాణా తదితర అవసరాల కోసం మొత్తం 115 వాహనాలను ఏర్పాటు చేశారు. వీటిలో 33 కార్లు, 82 బస్సులు ఉన్నాయి. నెల్లూరు నగరపాలక సంస్థకు 15 కార్లు, 70 బస్సులు కలిపి 85 వాహనాలు, ఆత్మకూరుకు 10 కార్లు, 7 బస్సులు కలిపి 17 వాహనాలు, బుచ్చిరెడ్డిపాళెంకు 8 కార్లు, 5 బస్సులు కలిపి 13 వాహనాలను కేటాయించారు.

50 ఎన్నికల నిఘా బృందాల ఏర్పాటు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల వ్యయ పరిశీలన, అక్రమ నగదు, ఇతర ప్రలోభాల నియంత్రణ కోసం జిల్లావ్యాప్తంగా 50 బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో 11 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (FST), 16 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (SST), 23 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) బృందాలు ఉన్నాయి. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 33, ఆత్మకూరులో 6, బుచ్చిరెడ్డిపాళెంలో 11 బృందాలను నియమించారు.

1,790 పోస్టల్ బ్యాలెట్లు జారీ

ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది, సర్వీస్ ఓటర్లు, పీడీ యాక్ట్ పరిధిలోని ఓటర్లకు కలిపి మొత్తం 1,790 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశారు. వీటిలో పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బందికి 1,677, సర్వీస్ ఓటర్లకు 99, పీడీ యాక్ట్ పరిధిలోని ఓటర్లకు 14 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశారు.మున్సిపాలిటీల వారీగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 1,390, ఆత్మకూరులో 208, బుచ్చిరెడ్డిపాళెంలో 192 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.