BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

నర్సాపురంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గొట్టిపాటి

Select Suryaa Now
నర్సాపురంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గొట్టిపాటి

నర్సాపురంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతరం ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సీఎండీలు పృథ్వీతేజ, శివశంకర్‌లతో పాటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని, అవసరమైతే పనిచేసే బ్యాచ్‌ల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి రాత్రింబవళ్లు శ్రమిస్తున్న విద్యుత్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైన భోజనం, వసతి సదుపాయాలు కల్పించాలని సూచించారు. తుపాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రభావిత 5,347 గ్రామాల్లో ఇప్పటివరకు పునరుద్ధరణ పనులను విజయవంతంగా పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. రేపు సాయంత్రానికి తుపాను ప్రభావిత ప్రాంతాలన్నింటిలో విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ముందుగా గృహ వినియోగదారులకు విద్యుత్ పునరుద్ధరణ పూర్తి చేసి, ఆ తర్వాత వరుసగా వ్యవసాయం, ఆక్వా రంగాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి ఆదుకుంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు.