మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కు ఏర్పాటు. ఆర్వో, ఆర్ వి వి సుబ్బారావు
మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కు ఏర్పాటు. ఆర్వో, ఆర్ వి వి సుబ్బారావు
మాచవరం న్యూస్ :మాచవరం మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఏర్పాటు చేయడం జరిగిందని మాచవరం మండలం రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ వి సుబ్బారావు శుక్రవారం తెలిపారు. మాచవరం మండలం పరిధిలోని పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారు మాచవరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన తెలిపారు. నవంబర్ 5న జరగనున్న జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓటుకు సంబంధించి అర్హులైన ఉద్యోగస్తులు, పోస్టల్ బ్యాలెట్ ఓటుకు అర్హులైన ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవచ్చునని ఆయన తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటుకు సంబంధించి బాక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ వి వి సుబ్బారావు తో పాటు, డిప్యూటీ ఎంపీడీవో వైపిఏ ప్రసాద్, మండల పరిషత్ కార్యాలయం సూపర్డెంట్ ఎన్ వి ఎల్ వి ప్రసాద్, మండల పరిషత్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.