మాజీ సర్పంచ్ వెలిది నాగబాబుకు మాతృ వియోగం
టి.నరసాపురం, మేజర్ న్యూస్:టి.నరసాపురం మండలం కే.జగ్గవరం గ్రామ మాజీ సర్పంచ్ వెలిది నాగబాబుకు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి వెలిది సరోజిని (72) ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
సరోజిని మృతి వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, గ్రామస్తులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వెలిది నాగబాబు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.