మాజీ మంత్రి శైలజ నాథ్ తో, తలారి రంగయ్య భేటీ...
అనంతపురం జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న పరిస్థితులపై మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ మంత్రి సాకే శైలజనాథ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా శింగనమల నియోజకవర్గంలో ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి చోటుచేసుకున్న తాజా పరిణామాలను తలారి రంగయ్య సాకే శైలజనాథ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ, రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న పరిస్థితులు, స్థానిక నాయకుల పాత్ర తదితర అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అదేవిధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అనంతరం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీ అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, నిరసన కార్యక్రమానికి దారితీసిన పరిస్థితులు, రాజకీయ పార్టీల స్పందన తదితర అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీ నాయకులు, కార్యకర్తల పరిస్థితులు, భవిష్యత్తులో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి సాకే శైలజనాథ్, మాజీ ఎంపీ తలారి రంగయ్య భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ := బోయ రంగస్వామి.