BREAKING
రవీంద్రభారతిలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు లక్మి నృసింహుని స్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క,పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ - రూ.4 కోట్లతో గెస్ట్ హౌస్ కి భూమి పూజ అర్హులందరికీ  ఇందిర బీమా యోజన అందిస్తాం .. ప్రయాణికుడితో దురుసు ప్రవర్తన... ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ విధుల నుంచి తొలగింపు అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప మహా పడిపూజ అంబర్పేట్ సీనియర్ సిటిజన్ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో అంది దేవేందర్  పుట్టినరోజు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి ఘన స్వాగతం కోడూరి లీలావతి దేవి శత జయంతి కార్యక్రమం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి 10+2 విద్యా విధానం పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జీవో జారీ చేయాలి. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి ఆటో డ్రైవర్‌పై హత్యాయత్నం.. ముగ్గురి అరెస్ట్‌ రిమాండ్‌ కు తరలింపు అభివృద్ధి బాటలో కాకర్లపహాడ్ గ్రామం టౌన్ ప్లానింగ్‌ పనులపై సీఎంసీ కమిషనర్‌ జి.సృజన సమీక్ష

టౌన్ ప్లానింగ్‌ పనులపై సీఎంసీ కమిషనర్‌ జి.సృజన సమీక్ష

Select Suryaa Now
టౌన్ ప్లానింగ్‌ పనులపై సీఎంసీ  కమిషనర్‌ జి.సృజన  సమీక్ష

మాదాపూర్,మేజర్ న్యూస్ : సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) పరిధిలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం కార్యకలాపాలపై కమిషనర్‌ జి.సృజన  సమగ్ర సమీక్ష నిర్వహించారు. జోనల్‌ కమిషనర్లు, చీఫ్‌ సిటీ ప్లానర్‌ (సీసీపీ), డిప్యూటీ కమిషనర్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  భూసేకరణ, బిల్డ్‌నౌ దరఖాస్తులు, ప్రజా ఫిర్యాదులు, లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌), కొనసాగుతున్న అభివృద్ధి పనులు, కోర్టు కేసుల పురోగతిపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, వివిధ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కమిషనర్‌ ఆదేశించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కొనసాగుతున్న పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.టౌన్‌ ప్లానింగ్‌ విభాగం పనుల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పెండింగ్‌ అంశాలపై తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్పొరేషన్‌ పరిధిలో చేపడుతున్న అన్ని కార్యక్రమాలను నిర్దేశిత కాలవ్యవధిలో సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు