telangana
రవీంద్రభారతిలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు
రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ 19 : విద్యార్థులు కష్టపడి చదివినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ చైర్మన్ డా. నవీన్ కుమార్ అన్నారు . ఖైరతాబాద్‌లోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్, హ్యాపీ కిడ్జ్ నర్సరీ అండ్ కిండర్ గార్టెన్ వార్షికోత్సవ వేడుకలను రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవీన్ కుమార్ పాల్గొని ప్రిన్సిపాల్ శిరీష జాతన్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆయా రంగాలలో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సభకు ముందు విద్యార్థులు దేశ సంస్కృతి, సంప్రదాయాలు వైవిధ్యాన్ని ప్రతిబింబించే పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.