BREAKING
ఉక్కు మహిళ ఇందిరా గాంధీ సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం: పి. విజయా రెడ్డి ఏకలవ్య ఎరుకల సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 22న తెలంగాణ రాష్ట్ర యువజన సదస్సు ఇందిరమ్మ  సేవలు చిరస్మరణీయం : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సేవాలాల్ జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఆహ్వానం ఎంపీపీ ఎన్నికపై గంట గంటకూ ఉత్కంఠ! పాలసీదారుడి జన్మదినాన్ని సేవా వేడుకగా మార్చిన ఎల్‌ఐసీ సలహాదారు కౌటికె విఠల్ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా:ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇదేందయ్య సామి ! మీ వేడుకలకోసం రోడ్లు మూసేస్తారా... పేద కుటుంబాల ఆర్ధిక భద్రత.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో యువత కీలక పాత్ర పోషించాలి: గవర్నర్ ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యం ప్రతినిధి హోదాకు భంగం కలిగిస్తే సహించేది లేదు. ఎమ్మెల్యే రవీంద్రభారతిలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

ఇదేందయ్య సామి ! మీ వేడుకలకోసం రోడ్లు మూసేస్తారా...

Select Suryaa Now
ఇదేందయ్య సామి !  మీ వేడుకలకోసం రోడ్లు మూసేస్తారా...
వెంగళరావునగర్, మేజర్ న్యూస్:అభివృద్ధి పనులు చేపట్టడం అవసరమే.. వ్యక్తిగత వేడుకలు నిర్వహించుకోవడమూ తప్పు కాదు. కానీ... వీటి కారణంగా ప్రజలకు, ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అయితే వెంగళరావునగర్  డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో తరచూ రోడ్లను పూర్తిగా మూసివేయడం, తవ్వకాలు చేపట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా అంబులెన్స్‌ సైతం వెళ్లేందుకు మార్గం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వెంగళరావునగర్  డివిజన్‌లోని డీ-బ్లాక్‌లో గురువారం ఓ కుటుంబం వేడుక నిర్వహణ కోసం రోడ్డుకు అడ్డంగా సైడ్‌వాల్స్‌ ఏర్పాటు చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు మధురానగర్‌ డీ బ్లాక్‌లో డీ-74 సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఇదే విధంగా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ నివాసం పక్కన కూడా రోడ్డును పూర్తిగా తవ్వేయడంతో ఆ రోడ్డులో కూడా రాకపోకలకు వీలు లేకుండా పోయింది.  ఆ రోడ్డును కాదని ముందుకు నేరుగా వెళదామన్నా రోడ్డు తవ్వకాల కారణంగా ఆ దారి మూసేసారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
 
అంబులెన్స్ కు దారిలేక...
 
ఈ క్రమంలో గురువారం ఓ అంబులెన్స్‌ వెళ్లేందుకు సరైన మార్గం లేక అటూ ఇటూ తిరగాల్సి వచ్చిందని కొందరు ఆవేదన వ్యక్తం చేసారు. రోగి ప్రాణాలను కాపాడేందుకు అంబులెన్స్‌ సకాలంలో ఆసుపత్రికి చేరుకోవడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిమిషాల ఆలస్యం కూడా ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది. 
 
సిద్ధార్థనగర్ లోనూ....
 
కొద్ది రోజుల క్రితం పక్కనే ఉన్న సిద్ధార్థనగర్ లో కూడా కొందరు తమ ఇళ్లల్లో జరిగిన కార్యక్రమానికి రోడ్డును పూర్తిగా మూసేయడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. వీరేగాక, 
అభివృద్ధి పనులు చేపట్టే అధికారులు సైతం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలి. ఒకే సమయంలో అన్ని రహదారులను తవ్వకుండా, కనీసం ఒక మార్గాన్ని రాకపోకలకు అందుబాటులో ఉంచాలి. ప్రత్యామ్నాయ దారుల వివరాలతో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. వేడుకలు నిర్వహించుకునే వారు కూడా రోడ్లను పూర్తిగా దిగ్బంధించేలా సైడ్ వాల్స్, బారికేడ్స్, ఇతర అడ్డంకులు ఏర్పాటు చేయకుండా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలి. 
 
రోడ్లు అందరివీ...
 
మన వేడుకలు, మన అభివృద్ధి పనులు ఇతరుల ప్రాణాలకు, అత్యవసర సేవలకు అడ్డంకిగా మారకూడదు. రోడ్లు అందరివి.. వాటిపై రాకపోకలు సాగించే హక్కు అందరికీ ఉంది. ఈ విషయాన్ని అధికారులు, నిర్వాహకులు, ప్రజలు గుర్తించి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.