telangana
ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యం
హిమాయత్ నగర్ , మేజర్ న్యూస్ : ఇంటి నుంచి ఈ నెల 16న బయటికి వెళ్లిన యువతి నేటికీ రాలేదని తండ్రి బాలాజీ పాటిల్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశాడు. స్టేషన్ ఇన్స్పెక్టర్ జి నరేష్ కుమార్ తెలిపిన ప్రకారం కోటి లోని బడి చౌడి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల స్నేహ బిరాధర్ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. అనంతరం రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అదే రోజు తెలిసిన బంధువులు, కుటుంబ సభ్యులు , యువతి స్నేహితుల ఇళ్లలో ఆరా తీశారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో తండ్రి స్టేషన్లో ఫిర్యాదు చేశాడని తెలిపారు. 5.4 అంగుళాల ఎత్తు, తెల్లని ఛాయా రంగుతో ఉన్న యువతి తెలుగు, హిందీ ,మరాఠీ భాషలు మాట్లాడగలుగుతుందని చెప్పారు. అదృశ్యమైన రోజు ఆకుపచ్చని పంజాబీ డ్రెస్ ధరించి ఉన్నట్లు తెలిపారు. తెలిపిన గుర్తులు ప్రకారం యువతిని గుర్తిస్తే కుటుంబ సభ్యుల నెంబర్ 9356855800 , స్టేషన్ నెంబర్ 871266126 4 కు కానీ సమాచారం ఇవ్వాలని ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు