BREAKING
సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం 10 రోజుల పాటు పార్కు మూసివేత ఆకాశంలో ఓ కొత్త తార.. వెలుగుల విందుతో కనువిందు చేసిన ఉల్కాపాతం! ప్రత్యేక ఓటరు జాబితా సవరణను రద్దు చేయాలి చింతలమానేపల్లి లో చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ సైబర్‌ సెక్యూరిటీపై గీతంలో ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ఉక్కు మహిళ ఇందిరా గాంధీ సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం: పి. విజయా రెడ్డి ఏకలవ్య ఎరుకల సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 22న తెలంగాణ రాష్ట్ర యువజన సదస్సు ఇందిరమ్మ  సేవలు చిరస్మరణీయం : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సేవాలాల్ జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఆహ్వానం ఎంపీపీ ఎన్నికపై గంట గంటకూ ఉత్కంఠ! పాలసీదారుడి జన్మదినాన్ని సేవా వేడుకగా మార్చిన ఎల్‌ఐసీ సలహాదారు కౌటికె విఠల్ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా:ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇదేందయ్య సామి ! మీ వేడుకలకోసం రోడ్లు మూసేస్తారా...

ఉక్కు మహిళ ఇందిరా గాంధీ సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం: పి. విజయా రెడ్డి

Select Suryaa Now
ఉక్కు మహిళ ఇందిరా గాంధీ సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం:   పి. విజయా రెడ్డి

జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్: భారత మాజీ ప్రధానమంత్రి, 'ఉక్కు మహిళ'   ఇందిరా గాంధీ   జయంతి సందర్భంగా రాజ్‌భవన్ హైస్కూల్‌లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ కంటెస్టెడ్  ఎమ్మెల్యే అభ్యర్థి, ఇన్‌చార్జ్  పి. విజయా రెడ్డి   పాల్గొని ఇందిరా గాంధీ   చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రగతి కోసం, పేదల అభ్యున్నతి కోసం ఇందిరా గాంధీ   చేసిన సేవలు, ఆమె త్యాగం, ధైర్యసాహసాలు నేటి తరానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఇందిరమ్మ ఆశయాలు చిరస్మరణీయమని, దేశానికి ఆమె అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని శ్రీమతి పి. విజయా రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.