BREAKING
కొవ్వూరి సాయి రత్న హాసిని రెడ్డికి స్వర్ణ పతకం దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రహస్యాలు! నూతన చేయుత పెన్షన్లను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం 10 రోజుల పాటు పార్కు మూసివేత ఆకాశంలో ఓ కొత్త తార.. వెలుగుల విందుతో కనువిందు చేసిన ఉల్కాపాతం! ప్రత్యేక ఓటరు జాబితా సవరణను రద్దు చేయాలి చింతలమానేపల్లి లో చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ సైబర్‌ సెక్యూరిటీపై గీతంలో ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ఉక్కు మహిళ ఇందిరా గాంధీ సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం: పి. విజయా రెడ్డి ఏకలవ్య ఎరుకల సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 22న తెలంగాణ రాష్ట్ర యువజన సదస్సు ఇందిరమ్మ  సేవలు చిరస్మరణీయం : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సేవాలాల్ జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఆహ్వానం ఎంపీపీ ఎన్నికపై గంట గంటకూ ఉత్కంఠ!

ప్రత్యేక ఓటరు జాబితా సవరణను రద్దు చేయాలి

Select Suryaa Now
ప్రత్యేక ఓటరు జాబితా సవరణను రద్దు చేయాలి
హిమాయత్ నగర్ ,మేజర్ న్యూస్ : ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ( సర్) ను రద్దు చేయాలని, రాజ్యాంగబద్ధ ప్రక్రియ కాదని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈనెల 22న రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామ్య వేదిక  ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజా సదస్సుకు సంబంధించిన వివరాల ప్రకటన, కరపత్రం విడుదలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కే రామచంద్రమూర్తి, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ న్యాయవాది జి జ్యోతి కిరణ్, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ - రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లు అనే పేరుతో ప్రజా సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సక్రమమైన ఎన్నికల జాబితా ద్వారా భవిష్యత్తులో ఎన్నికలు జరుగుతాయని ఆశించడం అసాధ్యం అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ ప్రక్రియ చేస్తుందన్నారు. రాజ్యాంగ హక్కులు పూర్తిగా విధ్వంసం చేస్తున్న సందర్భంగా ఈ ప్రక్రియను అభివర్ణించారు. ఈ విషయాలు తెలంగాణ మేధావి వర్గాన్ని కలవర పరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కొరకు రాజ్యాంగం, రాజ్యాంగ  రక్షణ కొరకు ప్రజలు అనే నినాదంతో ముందుకెళ్తామని ప్రకటించారు. ప్రొఫెసర్ కోదండరా మాట్లాడుతూ ఓట్లను సర్ పేరుతో తొలగిస్తున్నారని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో 90 లక్షల మంది ఓట్లు తొలగించినట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ ప్రజా సదస్సులో ముఖ్య వక్తగా సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అందించారు. అంతరం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఈ ప్రజా సదస్సుకు పెద్ద సంఖ్యలో హాజరు కవాలని వారు పిలుపునిచ్చారు.