హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : సైబర్ భద్రతలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అధ్యాపకులు, పరిశోధకులకు అవగాహన కల్పించే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్‌డీపీ) నిర్వహించనుంది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నిధులు, ఐఐటీ రూర్కీ సహకారంతో నవంబర్ 23 నుంచి 27 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
‘సైబర్ సెక్యూరిటీ కోసం పోస్ట్-క్వాంటం క్రిప్టోగ్రఫీ, ప్రామాణీకరణ, కృత్రిమ మేధస్సు’ అనే అంశంపై జరిగే ఈ కార్యక్రమంలో 5జీ, 6జీ నెట్‌వర్క్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటం కంప్యూటింగ్‌తో ఎదురవుతున్న భద్రతా సవాళ్లపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. క్వాంటం నిరోధక క్రిప్టోగ్రఫీ, సురక్షిత కమ్యూనికేషన్, ఏఐ ఆధారిత ముప్పుల గుర్తింపు, మాల్వేర్ విశ్లేషణ వంటి అంశాల్లో ఆచరణాత్మక శిక్షణ అందించనున్నారు.
ఐఐటీ రూర్కీ, ఐఐటీ జమ్మూ, ఐఐటీ బీహెచ్‌యూకు చెందిన ప్రముఖ నిపుణులు ఇందులో ప్రసంగించనున్నారు. నిపుణుల ఉపన్యాసాలు, సాంకేతిక చర్చలు, ప్రయోగాత్మక శిక్షణ ద్వారా అభివృద్ధి చెందుతున్న సైబర్ భద్రతా సాంకేతికతలపై అవగాహన కల్పించనున్నారు.ఏఐసీటీఈ, యూజీసీ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కంప్యూటర్ సైన్స్, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ విభాగాలకు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. విజయవంతంగా పూర్తి చేసిన వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు