BREAKING
సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం 10 రోజుల పాటు పార్కు మూసివేత ఆకాశంలో ఓ కొత్త తార.. వెలుగుల విందుతో కనువిందు చేసిన ఉల్కాపాతం! ప్రత్యేక ఓటరు జాబితా సవరణను రద్దు చేయాలి చింతలమానేపల్లి లో చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ సైబర్‌ సెక్యూరిటీపై గీతంలో ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ఉక్కు మహిళ ఇందిరా గాంధీ సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం: పి. విజయా రెడ్డి ఏకలవ్య ఎరుకల సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 22న తెలంగాణ రాష్ట్ర యువజన సదస్సు ఇందిరమ్మ  సేవలు చిరస్మరణీయం : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సేవాలాల్ జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఆహ్వానం ఎంపీపీ ఎన్నికపై గంట గంటకూ ఉత్కంఠ! పాలసీదారుడి జన్మదినాన్ని సేవా వేడుకగా మార్చిన ఎల్‌ఐసీ సలహాదారు కౌటికె విఠల్ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా:ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇదేందయ్య సామి ! మీ వేడుకలకోసం రోడ్లు మూసేస్తారా...

ఎంపీపీ ఎన్నికపై గంట గంటకూ ఉత్కంఠ!

Select Suryaa Now
 ఎంపీపీ ఎన్నికపై గంట గంటకూ ఉత్కంఠ!

* 12 గంటలకు వాయిదా పడిన సమావేశం.. 

* సభ్యుల గైర్హాజరుతో మారుతున్న రాజకీయ సమీకరణాలు

భోగాపురం, (మేజర్ న్యూస్): భోగాపురం మండల పరిషత్ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ గంట గంటకూ పెరుగుతోంది. ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు రాజకీయ పార్టీల మధ్య సాగుతున్న వ్యూహాలు, మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ అనూహ్య మలుపులు తిరుగుతోంది. గురువారం ఉదయం నిర్ణీత సమయం దాటినా ఎంపీటీసీ సభ్యులెవరూ సమావేశ మందిరానికి హాజరుకాకపోవడంతో ఎన్నికల ప్రక్రియలో మరింత ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11 గంటల సమయం దాటినా సభ్యుల హాజరు లేకపోవడంతో ప్రొసీడింగ్ అధికారి ఎం. రామారావు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశాన్ని మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి నిర్వహించనున్నట్లు ప్రకటించి వాయిదా వేశారు. దీంతో తదుపరి సమావేశానికి ఏయే పార్టీలకు చెందిన సభ్యులు హాజరవుతారు? ఎవరు ఎవరికి మద్దతు ప్రకటిస్తారు? అన్న అంశాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భోగాపురం మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఆరు, టీడీపీ మూడు, జనసేన మూడు, స్వతంత్రులు నాలుగు స్థానాలను గెలుచుకున్నారు. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో స్వతంత్ర సభ్యుల మద్దతు, పార్టీల మధ్య పొత్తులు, పరస్పర సహకారం కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎంపీపీ పీఠం కోసం జరుగుతున్న రాజకీయ కసరత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు నిర్ణీత సమయానికి సభ్యులెవరూ సమావేశానికి రాకపోవడం చర్చకు దారితీస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే సమావేశానికి ఎవరు హాజరవుతారు? సభ్యులంతా ఒకేసారి వస్తారా? లేక మరికొంత సమయం ఉత్కంఠ కొనసాగుతుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రొసీడింగ్ అధికారి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశంపైనా ఆసక్తి నెలకొంది. మొత్తంగా భోగాపురం ఎంపీపీ ఎన్నిక ఇప్పుడు పార్టీల బలాబలాలకే కాకుండా సభ్యుల హాజరు, మద్దతు కూడగట్టే ప్రయత్నాలు, చివరి నిమిషంలో చోటుచేసుకునే రాజకీయ పరిణామాల చుట్టూ తిరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమావేశంతోనైనా ఈ ఉత్కంఠకు తెరపడుతుందా? లేక మండల పరిషత్ అధ్యక్ష పీఠంపై మరికొంతసేపు సస్పెన్స్ కొనసాగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

 రిపోర్టర్: వై.శ్రీనివాస్, భోగాపురం.