BREAKING
పిల్లల భద్రత సినిమాతోనే ఆగిపోకూడదు అన్న విద్యా బాలన్ భారీ హంగులు, ఫ్రాంచైజీలకు మించి చిన్న సినిమాలకు చోటు కల్పించాలి- అభినయ్ డియో కొత్త ఏఐసీసీ కార్యదర్శుల నియామకం.. తెలంగాణకు సచిన్ సావంత్, సైమన్ అలెక్స్ ఆలయాల్లో సిరమ్మ ప్రత్యేక పూజలు... ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు ప్రారంభం.. సింహాద్రిపురంలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి! ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు.. ఎంపీటీసీల మెజారిటీతోనే రాజీ ప్రయత్నాలు! ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నగారా.. ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు.. ఎంపీటీసీ మెజారిటీలతోనే రాజీ ప్రయత్నాలు! 'అక్వాన్' ఎఫెక్ట్: ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్.. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇళ్లలో ఈడీ మెరుపు సోదాలు కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన తలారి రంగయ్య సిద్దిపేట గడ్డపై రేవంత్ గర్జన! బీఆర్ఎస్ పాలనపై విమర్శల వర్షం.. ప్రతి కుటుంబానికి భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా

ఆలయాల్లో సిరమ్మ ప్రత్యేక పూజలు...

Select Suryaa Now
ఆలయాల్లో సిరమ్మ ప్రత్యేక పూజలు...


విజయనగరం మేజర్ న్యూస్:
విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె మజ్జి సిరి సహస్ర (సిరమ్మ), ఈరోజు జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక నేపథ్యంలో విజయనగరం పట్టణంలోని ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె భర్త బడ్డుకొండ ప్రదీప్ నాయుడు వెంట ఉన్నారు.
కూటమి ప్రభుత్వం జడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా తన పేరును ప్రకటించిన నేపథ్యంలో, ఈరోజు ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు అమ్మవారినీ భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు అమ్మ వారి ఆశీస్సులు తీసుకున్నారు. జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించాలని, విజయనగరం జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసే శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించారు.
అమ్మవారి ఆశీస్సులతో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలని, జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తన బాధ్యతలను నిర్వర్తించేలా దీవించాలని కోరుతూ అమ్మవారి ఆశీస్సులు పొందారు. అలాగే ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.