BREAKING
కొత్త ఏఐసీసీ కార్యదర్శుల నియామకం.. తెలంగాణకు సచిన్ సావంత్, సైమన్ అలెక్స్ ఆలయాల్లో సిరమ్మ ప్రత్యేక పూజలు... ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు ప్రారంభం.. సింహాద్రిపురంలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి! ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు.. ఎంపీటీసీల మెజారిటీతోనే రాజీ ప్రయత్నాలు! ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నగారా.. ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు.. ఎంపీటీసీ మెజారిటీలతోనే రాజీ ప్రయత్నాలు! 'అక్వాన్' ఎఫెక్ట్: ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్.. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇళ్లలో ఈడీ మెరుపు సోదాలు కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన తలారి రంగయ్య సిద్దిపేట గడ్డపై రేవంత్ గర్జన! బీఆర్ఎస్ పాలనపై విమర్శల వర్షం.. ప్రతి కుటుంబానికి భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కాపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సుబ్రహ్మణ్యం రాజు : వైసీపీ బలపరిచిన అభ్యర్థి పోటీకి సన్నద్ధం ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని వెల్లడి వెల్దుర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా...సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఇ.పుష్పావతి

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నగారా..

Select Suryaa Now
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నగారా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడో మరియు చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడో దశలో మొత్తం 4,246 గ్రామ పంచాయతీల పరిధిలోని సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

షెడ్యూల్ ప్రకారం, మూడో విడత ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు రేపటి (నవంబర్ 21) నుంచి ఎన్నికల నోటీసు జారీ చేసి నామినేషన్లను స్వీకరించనున్నారు. అభ్యర్థులు నవంబర్ 23వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అనంతరం నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ), నవంబర్ 27 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.

తుది విడత పోలింగ్ డిసెంబర్ 2వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.