వెల్దుర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా...సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఇ.పుష్పావతి
అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయిస్తా
20 మంది అదనపు సిబ్బంది ని నియమిస్తా
రూ.5/- లకు ప్రతి ఇంటికి ఫిల్టర్ వాటర్ సరఫరా
సంత మార్కెట్ ను ఆధునీకరిస్తా
నిరంతరాయంగా తాగునీరు సరఫరా
పేదలకు ఇంటి పట్టా స్థలాలు
పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు
వెల్దుర్తి మేజర్ న్యూస్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఇ.పుష్పావతి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడతూ గతంలో వెల్దుర్తి మండల జడ్పీటీసీ గా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని అలాగే నా భర్త ఎల్.ఇ.జ్ఞానేశ్వర్ గౌడ్ గారు మండలాధ్యక్షుడు గా వెల్దుర్తి గ్రామంలో అభివృద్ధి పనులు చేశారని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక వెల్దుర్తి పట్టణంలో 1 కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి సిమెంట్ రోడ్లు, రామిరెడ్డి మైన్స్ దగ్గర రూ.25 లక్షలు ఖర్చు చేసి ప్రజల తాగునీటి సౌకర్యం కోసం బోర్ వేయించడం జరిగిందని తెలిపారు. వెల్దుర్తి పట్టణంలో ఇంకా అభివృద్ధి పనులు చేయాలనే దృడ సంకల్పం తో వెల్దుర్తి పట్టణాన్ని అన్ని రంగాల ల్లో అభివృద్ధి పథంలో నడిపించి ప్రజలకు పారాధర్శకమైన పాలన,మెరుగైన సేవలు అందించడానికి వెల్దుర్తి పట్టణ ప్రజలందరి ఆశీస్సులు కోరుతూ వెల్దుర్తి సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్నా నాకు మరియు నా తరుపున పోటీ చేస్తున్న 16 మంది వార్డు సభ్యులకు మీ అమూల్యమైన ఓట్లు వేసి వేయించి భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టణ ప్రజలను కోరుతూ తన అభివృద్ధి ప్రణాళికలు, ప్రధాన హామీలను ప్రకటించారు. ఆమె వెల్దుర్తి పట్టణ రూపురేఖలు మార్చడమే తన ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.
అన్నా క్యాంటీన్ ఏర్పాటు
పేద ప్రజల ఆకలి తీర్చేందుకు పట్టణంలో అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. శాసన సభ్యులు గౌ శ్రీ కె.ఇ.శ్యామ్ కుమార్ గారి సహకారంతో గ్రామంలోని ప్రజల కోసం మరియు వివిధ గ్రామాల నుండి పట్టణానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజల సౌకర్యార్థం పట్టణం లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయిస్తాం
20 మంది అదనపు సిబ్బంది నియామకం
పంచాయతీలో పారిశుద్ధ్యం, ఇతర సేవలను మరింత మెరుగుపరిచేందుకు 20 మంది అదనపు సిబ్బందిని నియమిస్తామన్నారు. మన పంచాయతి రూ-అర్బన్ గ్రామ పంచాయతి గా అప్ గ్రేడ్ అయినందున ప్రస్తుతం వున్న 39 మంది కాంట్రాక్టు సిబ్బంది కి ఆధనం గా మరో 20 మంది సిబ్బంది ని నియమించి ప్రజలు కు మెరుగైన సేవలు అందెటట్లు చర్యలు తీసుకుంటాం అని తెలిపారు
రూ.5 ల కే ఫిల్టర్ వాటర్
పట్టణ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మన శాసన సభ్యులు గౌ శ్రీ కె.ఇ. శ్యామ్ కుమార్ గారి సహకారంతో ప్రతి సచివాలయం కు ఆటో లను కేటాయియించి వాటికి వాటర్ టాంక్ లను అమర్చి ఇంటింటికీ కేవలం రూ.5 లకే శుద్ధమైన ఫిల్టర్ వాటర్ సరఫరా చేస్తాం
సంత మార్కెట్ ఆధునీకరణ
స్థానిక సంత మార్కెట్ ను శాసన సభ్యులు గౌ శ్రీ కె.ఇ.శ్యామ్ కుమార్ గారి సహకారంతో నాబార్డు ద్వార నిధులు సమీకరించి సంత మార్కెట్ ను డోన్ సంత మార్కెట్ మాదిరి గా ఆధునాతనం గా ఆధునీకరించి వ్యాపారులకు, వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు
తాగునీటి సరఫరా కు చర్యలు
పట్టణంలో తాగునీటి కొరత లేకుండ బ్రహ్మ గుండం దగ్గర వున్న బోర్లకు అధనంగా పులికుంట, రామిరెడ్డి మైన్స్, వీరనగట్ట చెరువు తదితర ప్రాంతాల దగ్గర కొత్తగా బోర్లు వేసి ప్రజలకు రెండు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా అయ్యేటట్లు చర్యలు తీసుకొని మంచినీటిని సరఫరా చేస్తాం
పేదలకు పట్టా స్థలాలు
పట్టణంలో నివాస స్థలం లేని అర్హులైన పేద కుటుంబాలకు శాసన సభ్యులు గౌ శ్రీ కె.ఇ.శ్యామ్ కుమార్ గారి సహకారం తో గ్రామంలో నివాస స్థలం లేని ప్రతి కుటుంబానికి 1-50 సెంటు ఇంటి పట్టా ఇస్తాం అలాగే గత 30 సం.రాలు గ్రామ పంచాయతి యందు పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బంధి కి 1.50 సెంటు పట్టా స్థలం ఇస్తూ ఖాళీ స్థలం వున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుండి ఇంటి కట్టుకోవడానికి బిల్డింగ్ మంజూర్ చేయిస్తాం
అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మిస్తాం
శాసన సభ్యులు గౌ శ్రీ కె.ఇ.శ్యామ్ కుమార్ గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించుకొని పంచాయతి పరిధిలో ప్రధాన రహదారి వెంట ప్రస్తుతం వున్న కాలువకు సమాంతరంగా కాలువ నిర్మాణం చేస్తూ మరియు పాత బస్టాండ్ నుండి రామళ్లకోట బ్రిడ్జ్ వరకు రెండు వైపుల అండర్ గ్రౌండ్ డ్రైనేజి కాలువను నిర్మిస్తాం అని అలాగే పట్టణ ప్రగతికి, పేదల సంక్షేమం ప్రధాన ఎజెండా తో సర్పంచ్ అభ్యర్తి గా పోటీ చేస్తున్న తనకు మరియు వార్డు సభ్యులు గా పోటీ చేస్తున్న అభ్యర్థులను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎల్.ఇ. పుష్పవతి ఈ సందర్భంగా ఓటర్లను కోరారు