పలమనేరు మండల ఎంపిపి గా భువనేశ్వరి జగదీష్ నాయుడు ప్రమాణ స్వీకారం
పలమనేరు మేజర్ న్యూస్ స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పలమనేరు మండల ఎంపీపీగా భువనేశ్వరి జగదీష్ నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రిసైడింగ్ అధికారి మహమ్మద్ ఆజాద్ చే ప్రమాణం చేయించారు. అనంతరం 10 పంచాయతీల్లో గెలుపొందిన టిడిపి ఎంపీటీసీచే కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఈమె మహిళా ఎంపీపీగా భువనేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైనారు. పలమనేరు మండల ఎంపిపి భువనేశ్వరి జగదీష్ నాయుడు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. అనంతరం పలువురు ప్రజా ప్రతినిధులు టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన భువనేశ్వరి జగదీష్ నాయుడులను సన్మానించడం జరిగింది. ఎంపీడీవో కార్యాలయాన్ని సుందరీ కారణంగా తీర్చిదిద్దారు. అనంతరం వచ్చిన వారికి భోజన వసతి కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా నూతన పలమనేరు మండల ఎంపీపీ భువనేశ్వరి జగదీష్ నాయుడు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలన్నదే ఆయన లక్ష్మన్నారు. అదేవిధంగా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.
అనిల్ కుమార్ యాదవ్