BREAKING
ఊలపాడు పంచాయతీ సర్పంచ్ బరిలో భూపాల్ రాజు : కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ నేటి నుండి బోగడగూడ చర్చిలో క్రీస్తు రాజు పండుగ మహోత్సవాలు జెడ్పి ఛైర్మన్,మంత్రి మండిపల్లిని కలిసిన పచ్చిపాల రామకృష్ణ ఆచారి జిల్లావ్యాప్తంగా పోలీసుల విస్తృత నాకాబందీ తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు : ఎస్పీ స్నేహ మెహ్ర పరిటాల శ్రీరామ్ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ. సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే. అమిత్ షాకు దమ్ముంటే ఓవైసీపై పోటీ చేయాలి వరికుంటలో మంచూరు మాస్టర్ ప్లాన్.. వైసీపీకి భారీ షాక్ నేడు కొల్లాపూర్‌కు తీన్మార్ మల్లన్న రాక జల్ పల్లి జగన్ మృతి ఘటనకు (టఆర్ జి) హాస్పత్రిపై ప్రత్యేక విచారణ కళ్యాణదుర్గంలో కుదరని సయోధ్య.. మళ్లీ వాయిదా పడ్డ ఎంపీపీ ఎన్నికలు. బీసీ సీటులో ఓసిని ఎలా కూర్చోబెట్టారు నేపాల్‌పై ఇండియా-ఎ చారిత్రక విజయం.. 306 పరుగుల భారీ తేడాతో గెలుపు! న్యూజిలాండ్ గడ్డపై కేఎల్ రాహుల్ శతకం.. భారత్ పటిష్ట పోరాటం! ప్రజాసేవే లక్ష్యంగా.. హనుమంతునిపాడు అభివృద్ధికి కృషి చేస్తా

సమస్యాత్మక గ్రామాల్లో ఎస్ ఐ బస.. ఎన్నికల భద్రత పై ప్రత్యేక నిఘా..

Select Suryaa Now
సమస్యాత్మక గ్రామాల్లో ఎస్ ఐ బస.. ఎన్నికల భద్రత పై ప్రత్యేక నిఘా..

కంబదూరు: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కంబదూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని అత్యంత సమస్యాత్మక గ్రామంగా గుర్తించిన రాళ్ల అనంతపురంలో కంబదూరు ఎస్సై ప్రత్యేకంగా పర్యటించారు. గ్రామంలో పర్యటించడంతో పాటు ప్రజలతో సమావేశం నిర్వహించి ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, పోలీసుల భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడరాదని సూచించారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత గొడవలుగా మార్చుకోవద్దని, ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. గ్రామంలో గొడవలు సృష్టించడం, ప్రత్యర్థులను బెదిరించడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వంటి చర్యలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారని హెచ్చరించారు. అదేవిధంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, మద్యం పంపిణీ చేయడం, ఓటు వేయకుండా అడ్డుకోవడం, ఇతరులపై ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా జరిగేందుకు గ్రామస్తులందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా అవాంఛనీయ సంఘటనలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం ఎస్సై రాళ్ల అనంతపురం గ్రామంలోనే రాత్రి బస చేసి భద్రతా పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించారు. రాత్రి వేళ గ్రామంలో గస్తీ నిర్వహిస్తూ పరిస్థితులను సమీక్షించారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు నిఘా ఏర్పాటు చేసి, ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు. సమస్యాత్మక గ్రామంలో ఎస్సై స్వయంగా రాత్రి బస చేయడం పోలీసుల ప్రత్యేక భద్రతా చర్యలకు నిదర్శనంగా నిలిచింది. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారనే సంకేతం గ్రామ ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు పిలుపునిచ్చారు.