ఓం శక్తి మాల ధరించిన మహిళలకు ఉచితంగా టూర్ సౌకర్యం- డాక్టర్ మురుగన్
పలమనేరు మేజర్ న్యూస్ పట్టణ సమీపంలోని గంటవూరు బిసి కాలనీలో వెలసి ఉండు శ్రీ తిరుపతి గంగమ్మ గుడి చైర్మన్, స్వర్ణ నంది అవార్డు గ్రహీత డాక్టర్ మురుగన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 4వ తేదీ నుండి ఓం శక్తి మాల ధరించిన వారికి ఉచితంగా 6 రోజులు టూర్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో ప్రత్యేకంగా ఓం శక్తి మాల ధరించిన వారు 1.470 మందికి 6రోజులు టూర్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది . ఇందులో 2వేలు మంది 20 బస్సుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలైన గుడులను దర్శనం చేయడం జరుగుతుందన్నారు. మాల ధరించిన వారికి మూడు పూటలా టిఫన్ భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మాల ధరించిన వారు ఫోటో ఆధార్ కార్డు కలర్ జిరాక్స్ అందించాలన్నారు. అదేవిధంగా భవాని మాల ధరించిన వారికి కూడా ఉచిత టూరు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సందర్భంగా వారిని టూర్కు పంపించ లేకపోయామని తెలిపారు.
అనిల్ కుమార్ యాదవ్