ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి
ఏలూరు, మేజర్ న్యూస్ : జిల్లా ఖజానా అధికారి బొడ్డు ఇమ్మానియేల్ ను కల్సి పూల మొక్క నిచ్చి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు. ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను జిల్లా ఎన్జీవో నాయకులు వివరించారు. ట్రెజరీ శాఖ ద్వారా రావాల్సిన బకాయిలు, త్వరితగతిన ఉద్యోగులుకి ఇచ్చి సి ఎఫ్ ఎం ఎస్ ద్వారా ఉన్న ఇబ్బందులు తొలగించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్,
జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ ఎస్ హరనాధ్ పాల్గొన్నారు.