BREAKING
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ కి ఘన నివాళి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరమ్మ: సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు రోడ్లు వేశారు.. బిల్లులు ఆగిపోయాయి! మాజీ ఎస్ ఈ ,ఇఇలకు హైకోర్టు వారెంట్ నేటి పంచాంగం 20 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 20 నవంబర్, 2026 డిసెంబరు జీ20 సదస్సుకు పుతిన్‌ హాజరయ్యే అవకాశంపై కీలక సంకేతం.. అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ఉత్కంఠ! ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు 50-60% పెరిగినా.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో బ్రాండ్ విలువలో 45% వరకు భారీ క్షీణత.. భారత ప్రభుత్వంతో దెబ్బతిన్న సంబంధాలను చక్కదిద్దేందుకు కొత్త పాలసీ చీఫ్‌ను నియమించనున్న మెటా! మెటా సేవలకు సంబంధించిన 950 ఉద్యోగాల కోతకు యాక్సెంచర్‌ ప్రణాళిక.. ఐటీ రంగంలో మరోసారి కలకలం! కృత్రిమ మేధ సమాచార కేంద్రాలకు యూరోపియన్‌ బ్యాంకుల రుణాలు వేగంగా పెరుగుతున్నాయి.. తొమ్మిది నెలల గరిష్ఠానికి భారతీయ వాటా సూచీలు.. దేశీయ స్టాక్ మార్కెట్లో జోరుగా కొనుగోళ్లు! బంగారం, రాగి ధరల్లో స్వల్ప పుంజుకోవడం.. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు! మయన్మార్‌లో రోహింగ్యాలపై జనసంహారం జరిగిందని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు.. ఐక్యరాజ్యసమితి సంస్కరణలు, ఇంధన సరఫరా పెంపు, అణు ప్రమాదాల తగ్గింపుపై మూడు దేశాల ఉమ్మడి ప్రకటన!

మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ కి ఘన నివాళి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరమ్మ: సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు

Select Suryaa Now
మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ కి ఘన నివాళి  పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరమ్మ: సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు

మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ కి ఘన నివాళి

పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరమ్మ: సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు

నేరేడుచర్ల: మేజర్ న్యూస్
భారతదేశపు ఉక్కు మహిళ, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను గురువారం కల్లూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడటానికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. హరిత విప్లవం ద్వారా దేశాన్ని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా చేశారని, బ్యాంకుల జాతీయీకరణ, గరీబీ హటావో వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. నేటి తరం నాయకులు, కార్యకర్తలు ఇందిరా గాంధీ ఆశయాలను, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లూరు గ్రామ సర్పంచ్ చలసాని మంజుల శ్రీనివాసరావు, నియోజకవర్గ నాయకుడు చలసాని రాజీవ్, కల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుడిగె వెంకటేశ్వర్లు గౌడ్, నేరేడుచర్ల మాజీ అగ్రికల్చర్ డైరెక్టర్ కొడాలి పట్టయ్య, మాజీ పిఏసీఎస్ చైర్మన్ కొడాలి భాస్కర్ రావు, మాజీ వైస్ ఎంపీపీ చలసాని మాధవరావు, ఉప సర్పంచ్ ఉప్పెల్లి మహేష్,యార్లగడ్డ వెంకటేశ్వరరావు, మేకపోతుల నాగరాజు, పిచ్చయ్య, బుడిగె మల్లయ్య,రోశయ్య, సోమయ్య, రంగయ్య, హుస్సేన్, హరికృష్ణ, సిరికొండ జానకి రాములు, ప్రేమ్ కుమార్, ఉప్పెల్లి రాములు, వెంకటేశ్వర్లు, పెద్ద వెంకటయ్య, సోమయ్య, గుడుగుంట్ల వెంకటయ్య, బిక్షం, శేఖర్, గజగంటి ప్రవీణ్, దానేలు, అక్కయ్య బాబు, సుదర్శన్, అనంతు వెంకటేశ్వర్లు, రమేష్, భార్గవ్, జగన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.