BREAKING
బ్యాచులర్ పార్టీ డ్యూక్స్ రివ్యూ.. 14 ఏళ్ల తర్వాత అమల్ నీరద్ స్టైలిష్ యాక్షన్ ఎలా ఉందంటే? అన్నారంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ రుద్ర సహిత కాలబైరవ మహా యజ్ఞంకు విస్తృత ఏర్పాట్లు ఓం సినిమాకు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. తెలుగు వెర్షన్‌కే అగ్రస్థానం! శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం శరీరానికి ఉపవాసం..మనసుకు నామస్మరణ.. ఆత్మకు ఆధ్యాత్మిక చింతన..అనుగ్రహించేదే.. మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం హెయిల్ మేరీ నుంచి మారివిల్ చిరకే వీడియో సాంగ్ విడుదల.. సూరజ్ వెంజారమూడు భావోద్వేగ నటన! ఆకాశంలో ఒక తార అడ్వాన్స్ బుకింగ్ షురూ.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్‌కు దుల్కర్ సల్మాన్ సిద్ధం! అధికారుల పర్యవేక్షణ ఏదీ? గోడలపై ప్రకటనల జోరు! 14 రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి రామాయణ.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర! సలార్-2 కంటే ముందే డ్రాగన్-2? ప్రశాంత్ నీల్ సీక్వెల్ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ! ఆగ్నేయాసియా సైబర్ స్కామ్ కేంద్రాలపై అమెరికా ఆంక్షలు భర్త మత్తుమందు ఇచ్చి వేధించిన కేసు..నలుగురు బ్రిటన్ వ్యక్తులకు దోషిగా తీర్పు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే పోషకాహారాలు.. మూత్రపిండాల రక్షణకు వైద్యుల సూచనలు!

మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం

 


తుర్కపల్లి , మేజర్ న్యూస్
తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనార్ధాలపై అవగాహన కల్పించేందుకు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణ ,గ్రామ సర్పంచ్ తునికి లక్ష్మీరామిరెడ్డి లు మాట్లాడుతూ యువత చెడు అలవాటులకు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మంచి విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. గంజాయి మాదకద్రవ్యాలు ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితము కుటుంబము సమాజంపై తీవ్ర దుష్పరిణామాలు కలుగుతాయని వివరించారు. మాదకద్రవ్యాల వినియోగము అక్రమ రవాణా వంటి కార్యకర్తలకు దూరంగా ఉండాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు .విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండారి సత్యం మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో క్రమశిక్షణ పట్టుదల మంచి నడివడుకను అలవర్చుకోవాలని, మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని అన్నారు ప్రతి విద్యార్థి తన స్నేహితులు కుటుంబ సభ్యులు సమాజంలో ప్రజలకు కూడా మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాటికొండ నరసింహులు ,వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, బిక్కం సాహెబ్, కచ్చిగళ్ళ మల్లయ్య, విజయ్ కుమార్, జరీనా భాను బేగం, ఉషారాణి, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు