ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశానికి ఆదర్శం
ఆమనగల్లు, మేజర్ న్యూస్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్ అన్నారు.గురువారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్థికంగా అండగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కృషి చేయాలని చైర్మన్ కోరారు. మున్సిపాలిటీ లోని అన్నివార్డులలో అర్హత కలిగిన లబ్ధిదారుల వివరాలను నమోదు ప్రక్రియ చేపట్టె అధికారులకు మున్సిపాలిటీ ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తినియోజకవర్గంలోఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలోప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ పిలుపునిచ్చారు.సమావేశంలో కౌన్సిలర్ అనిత శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు శివలింగం, కో ఆప్షన్ సభ్యుడు ఖాదర్, నాయకులు పూసల సత్యం, మహేష్ ,వెంకటేష్ అబ్దుల్ అలీమ్, శ్రీను,తదితరులు ఉన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్, రంగారెడ్డి జిల్లా.