ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం
పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిర జయంతి వేడుకలు…..
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్...
(కిరణ్ కుమార్ ఆరిక)
భారతరత్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను పెనుబల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో
వి ఎం బంజరు రింగ్ సెంటర్ విగ్రహం వద్ద ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఇందిరా గాంధీకి జోహార్లు అర్పించారు. భారతదేశ ఉక్కు మహిళగా ప్రధానమంత్రిగా ఆమె చేసిన సంస్కరణలు, ప్రణాళికలు, పాలనదక్షతతో భారత దేశాన్ని నడిపించాయని ఇందిరా గాంధీ సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు గూడూరు మాధవరెడ్డి,ఈడ కమలాకర్, కొప్పుల రామరాజు, మిట్టపల్లి కిరణ్ వంగ చంద్రశేఖర రావు, ఎస్ కే భాష, మద్దుల వెంకయ్య మారిన శ్రీనివాసరావు, వేల్పుల కనకారావు, అన్నప్పరెడ్డి లక్ష్మణరావు, గోదా చెన్నారావు, బొర్రా బాబు, వంగ కృష్ణ, ఎస్టీ సెల్ నాయకులు తెల్లం సురేష్, వేముల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.