BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశానికి ఆదర్శం పెంగరగుంట ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి పెంగరగుంట ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అమరనాథరెడ్డి ఓం శక్తి మాల ధరించిన మహిళలకు ఉచితంగా టూర్ సౌకర్యం- డాక్టర్ మురుగన్ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు ఆహ్వానం పోలాండ్‌లో తొలి అణు విద్యుత్‌ కేంద్ర నిర్మాణ ఒప్పందం 2027లో.. ఇంధన భద్రత దిశగా కీలక అడుగు! వియత్నాం–రష్యా మధ్య ఇంధన రంగ సహకార విస్తరణ.. కొత్త చమురు, గ్యాస్ ప్రాజెక్టులపై కీలక ఒప్పందాలు! తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం హూతీల దాడుల నేపథ్యంలో సౌదీ యువరాజుతో అమెరికా సైనికాధికారి భేటీ.. మధ్యప్రాచ్య భద్రతపై కీలక చర్చలు! కీవ్‌లో నెదర్లాండ్స్‌ రాయబార కార్యాలయం సమీపంలో ప్రక్షేపకం.. ఆందోళనలో దౌత్య వర్గాలు! అమెరికాలో చైనా టెలికాం సంస్థలపై మరిన్ని ఆంక్షలు.. జాతీయ భద్రత దృష్ట్యా కఠిన నిర్ణయాలు! అమెరికాలో చైనా టెలికాం సంస్థలపై మరిన్ని ఆంక్షలు.. జాతీయ భద్రత దృష్ట్యా కఠిన నిర్ణయాలు! చరిత్రలో తొలిసారి ఒకే వేదికపై ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ ఆంథ్రోపిక్‌ వాటా అరంగేట్రం ఘనంగా ఉన్నా అమెరికా విపణుల్లో భారీ అమ్మకాలు.. నష్టాల్లో ముగిసిన వాల్‌స్ట్రీట్! అక్టోబరులో భారత ముడి చమురు దిగుమతులు 4.7 శాతం పెరుగుదల.. పండుగ డిమాండ్‌తో పుంజుకున్న ఇంధన వినియోగం!

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Select Suryaa Now
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం సమయానికి శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

దర్శన టోకెన్లు లేని భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం (నవంబర్ 19) నాడు మొత్తం 67,915 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 23,399 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా రూ. 4.61 కోట్ల ఆదాయం లభించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.