BREAKING
‎ధర్మో రక్షతి రక్షితః ‎(ఆథ్యాత్మిక వ్యాసం) జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా అభి హబిమున్నీసా చాంద్ భాయ్.. అయోమయం..అంతర్మథనం.. అంతుచిక్కని అసంతృప్తి! మండలంలో పంచాయతీ నామినేషన్ల ఘట్టంతో రాజుకున్న రాజకీయ వేడి అధికార కూటమిలో ఐదు చోట్ల బహుముఖ పోటీ.. రెండు చోట్ల వైసీపీలోనూ అదే పరిస్థితి.. ఆశావహుల మధ్య ఆధిపత్య పోరు.. బుజ్జగింపులకు లొంగని అసంతృప్తులు! అనకాపల్లి జడ్పీ పీఠం జనసేన కైవసం.. ఛైర్‌పర్సన్‌గా మోటూరు నాగమణి! సివిల్ సప్లై కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశానికి ఆదర్శం పలమనేరు మండల ఎంపిపి గా భువనేశ్వరి జగదీష్ నాయుడు ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశానికి ఆదర్శం పెంగరగుంట ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి పెంగరగుంట ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అమరనాథరెడ్డి ఓం శక్తి మాల ధరించిన మహిళలకు ఉచితంగా టూర్ సౌకర్యం- డాక్టర్ మురుగన్ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు ఆహ్వానం పోలాండ్‌లో తొలి అణు విద్యుత్‌ కేంద్ర నిర్మాణ ఒప్పందం 2027లో.. ఇంధన భద్రత దిశగా కీలక అడుగు! వియత్నాం–రష్యా మధ్య ఇంధన రంగ సహకార విస్తరణ.. కొత్త చమురు, గ్యాస్ ప్రాజెక్టులపై కీలక ఒప్పందాలు! తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

అయోమయం..అంతర్మథనం.. అంతుచిక్కని అసంతృప్తి! మండలంలో పంచాయతీ నామినేషన్ల ఘట్టంతో రాజుకున్న రాజకీయ వేడి అధికార కూటమిలో ఐదు చోట్ల బహుముఖ పోటీ.. రెండు చోట్ల వైసీపీలోనూ అదే పరిస్థితి.. ఆశావహుల మధ్య ఆధిపత్య పోరు.. బుజ్జగింపులకు లొంగని అసంతృప్తులు!

Select Suryaa Now
అయోమయం..అంతర్మథనం.. అంతుచిక్కని అసంతృప్తి!  మండలంలో పంచాయతీ నామినేషన్ల ఘట్టంతో రాజుకున్న రాజకీయ వేడి  అధికార కూటమిలో ఐదు చోట్ల బహుముఖ పోటీ.. రెండు చోట్ల వైసీపీలోనూ అదే పరిస్థితి..  ఆశావహుల మధ్య ఆధిపత్య పోరు.. బుజ్జగింపులకు లొంగని అసంతృప్తులు!

చిట్టమూరు మేజర్ న్యూస్

చిట్టమూరు మండలంలో పంచాయతీ ఎన్నికల రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి.ఈ నెల 18వ తేదీ నుంచి రెండు రోజులపాటు నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో మండలంలోని 23 గ్రామ పంచాయతీల నుంచి అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.అయితే ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమిలోనే ఐదు పంచాయతీల్లో ఆశావహుల మధ్య బహుముఖ పోటీ తీవ్రంగా కనిపిస్తుండగా,ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ రెండు పంచాయతీల్లో ఇదే తరహా పరిస్థితులు నెలకొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.దీంతో ఇరు పార్టీల్లోనూ అంతర్గత రాజకీయాలు, అసంతృప్తులు,ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అధికార కూటమికి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు సర్పంచ్ పదవులపై ఆశలు పెట్టుకుని ఒకే పంచాయతీలో ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున నామినేషన్లు దాఖలు చేయడం స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతోంది.అధికారంలో ఉన్న పార్టీ కావడంతో గ్రామస్థాయిలో పదవుల కోసం పోటీ ఎక్కువ కావడం, తమ రాజకీయ పలుకుబడిని నిరూపించుకోవాలనే ఆకాంక్షతో పలువురు అభ్యర్థులు వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేకపోవడం నాయకత్వానికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ రెండు పంచాయతీల్లో ఆశావహుల మధ్య పోటీ నెలకొనడం గమనార్హం. అధికార కూటమిలో ఐదు చోట్ల, వైసీపీలో రెండు చోట్ల ఒకే పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు పోటీకి దిగడంతో గ్రామస్థాయి రాజకీయాల్లో వ్యక్తిగత ప్రాధాన్యతలు,స్థానిక ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది.పార్టీ నాయకత్వం ఒకరికి మద్దతు ప్రకటించినా మిగిలిన ఆశావహులు ఏ మేరకు సహకరిస్తారన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.ఇదిలా ఉంటే, గతంలో మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలు కూడా ప్రస్తుత పంచాయతీ ఎన్నికల రాజకీయ సమీకరణాల్లో కీలకంగా మారుతున్నాయి.ఆ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలను తెలుగుదేశం,నాలుగు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు దక్కించుకున్నాయి.ఈ ఫలితాలతో మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యం స్పష్టమైనప్పటికీ,నాలుగు స్థానాల్లో విజయం సాధించిన వైసీపీకి కూడా 12 ఎంపీటీసీ సెగ్మెంట్ల పరిధిలో బలమైన కేడర్,స్థానికంగా ప్రభావం ఉన్న నాయకులు ఉన్నారన్న విషయం విస్మరించలేనిది.అప్పట్లో ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వడం,కొన్ని ప్రాంతాల్లో తమ పట్టును నిరూపించుకోవడం ప్రస్తుత పంచాయతీ ఎన్నికలపై ఆసక్తిని పెంచుతోంది.ఎంపీటీసీ ఎన్నికల్లో సాధించిన ఆధిక్యాన్ని పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని అధికార కూటమి భావిస్తుండగా, పంచాయితీ ఎన్నికల్లో రాజకీయంగా బలపడాలని వైసీపీ వ్యూహాలు ప్రయత్నించే అవకాశం ఉంది.అయితే ఈసారి అధికార కూటమి నుండి ప్రధాన సమస్య ప్రత్యర్థి పార్టీ కంటే సొంత పార్టీలోని ఆశావహుల మధ్య నెలకొన్న పోటీగా మారడం విశేషం. ఒకవైపు ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి ఉండగా,మరోవైపు సొంత పార్టీ అభ్యర్థులను సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అధికార కూటమిలో ఇప్పటికే పలుచోట్ల బుజ్జగింపుల ప్రయత్నాలు సాగించినప్పటికీ ఆశావహులు తమ నిర్ణయాల నుంచి వెనక్కి తగ్గేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదన్న చర్చ మండల రాజకీయాల్లో వినిపిస్తోంది.పార్టీ పెద్దలు,స్థానిక నాయకులు రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా ఆశావహులు తమ రాజకీయ భవిష్యత్తు,గ్రామాల్లో ఉన్న వ్యక్తిగత బలాబలాలను దృష్టిలో పెట్టుకుని పోటీకి సిద్ధంగా ఉండటంతో నాయకత్వం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.దీంతో ఎవరిని బరిలో కొనసాగించాలి.. ఎవరిని ఉపసంహరణకు ఒప్పించాలి.. అసంతృప్తులకు ఎలాంటి హామీలు ఇవ్వాలన్న అంశాలపై నాయకత్వం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వైసీపీలోనూ గత ఎంపీటీసీ ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన కేడర్‌ను కాపాడుకుంటూనే ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇరు పార్టీల్లోనూ అసంతృప్తులు ఎన్నికల వరకు కొనసాగితే దాని ప్రభావం కేవలం సర్పంచ్ పదవులకే కాకుండా రాజకీయంగా పలు సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది.ఒకే పార్టీకి చెందిన అభ్యర్థుల మధ్య ఓట్లు చీలిపోతే ప్రత్యర్థులకు అనుకోని రాజకీయ ప్రయోజనం చేకూరే ప్రమాదమూ ఉంది.నామినేషన్ల దాఖలుతో మొదలైన ఈ రాజకీయ పరిణామాలకు ఉపసంహరణల ఘట్టం కీలక మలుపు కానుంది.పార్టీ నాయకత్వం చేసే బుజ్జగింపులు ఎంతవరకు ఫలిస్తాయి..ఆశావహులు అధినాయకత్వం మాట వింటారా..లేక రెబల్ అభ్యర్థులుగా బరిలో కొనసాగుతారా..అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.గత ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు,గ్రామస్థాయిలో పార్టీలకున్న కేడర్ బలం,ప్రస్తుత ఆశావహుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు..ఈ మూడు అంశాలు చిట్టమూరు మండల పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముంది.మొత్తంగా 23 పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైనప్పటికీ,అసలు రాజకీయ పరీక్ష మాత్రం పార్టీలకు తమ సొంత శ్రేణులను ఏకతాటిపైకి తీసుకు రావడంలోనే కనిపిస్తోంది.అధికార కూటమిలో ఐదు చోట్ల,ప్రతిపక్ష వైసీపీలో రెండు చోట్ల నెలకొన్న బహుముఖ పోటీలు నాయకత్వ సమన్వయ సామర్థ్యానికి పరీక్షగా నిలుస్తున్నాయి.బయటకు రెండు పార్టీల మధ్య ఎన్నికల పోరు కనిపిస్తున్నా,లోలోపల మాత్రం సొంత పార్టీ ఆశావహుల మధ్యే ఆధిపత్య పోరు సాగుతోంది.ఈ అయోమయం, అంతర్మథనం,అంతుచిక్కని అసంతృప్తికి ఉపసంహరణలతో తెరపడుతుందా లేక ఎన్నికల బరిలోనూ ఇదే అంతర్గత పోరు కొనసాగి రాజకీయ ఫలితాలను తారుమారు చేస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.

అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్