మదనపల్లెలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు : హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్.కే.బాషా,సింగం రామకృష్ణా రెడ్డి
మదనపల్లె,మేజర్ న్యూస్ :భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి,ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ జయంతి వేడుకలను గురువారం మదనపల్లె పట్టణంలో ఘనంగా నిర్వహించారుపట్టణంలోని బెంగళూరు బస్టాండ్ కూడలిలో ఇందిరాగాంధీ విగ్రహానికి ఏపీ కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా,ఏపీ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం రామకృష్ణా రెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను,ఆమె నాయకత్వ పటిమను,దేశ అభివృద్ధికి అందించిన కృషిని స్మరించుకున్నారు.ఇందిరాగాంధీ భారత రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన గొప్ప నాయకురాలని కొనియాడారు.దేశ ఐక్యత,సమగ్రత,ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.పేదలు,బడుగు ,బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని వెల్లడించారు.దేశ ప్రధానిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ధైర్య సాహసాలతో పాలన సాగించిన ఇందిరాగాంధీని నేటితరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఆమె ఆశయాలు,సిద్ధాంతాలు,ప్రజాసేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు.ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ఆమె చూపిన మార్గంలో నడుస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగూ నాయక్,సాదిక్ వలి,అజమత్ ఖాన్,షమీమ్ షేక్,అమీర్ సాహెబ్,అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి