మాజీ ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
పలమనేరు మేజర్ న్యూస్ కర్ణాటక రాష్ట్రం నంగిలిలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలో మాజీ ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆత్మీయంగా కలుసుకున్నారు. పెద్దపంజాణి మండలం గోనుమాకులపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఇద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎదురుపడిన ఇరువురు నేతలు చిరునవ్వులతో పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. కొద్దిసేపు ఆప్యాయంగా ముచ్చటించుకోవడంతో అక్కడి వాతావరణం సందడిగా మారింది.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్