గుమ్మగట్ట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) ప్రిన్సిపల్, ప్రధాన వంట మనిషి మరియు అసిస్టెంట్ కుక్‌లను విధుల నుంచి తొలగింపు..
గుమ్మగట్ట మేజర్ న్యూస్:
సమగ్ర శిక్ష అనంతపురం జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ ఉత్తర్వులు జారీ.
అనంతపురం జిల్లా గుమ్మగట్ట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ప్రిన్సిపల్, ప్రధాన వంట మనిషి (హెడ్ కుక్) మరియు అసిస్టెంట్ కుక్‌లను విధుల నుంచి తొలగిస్తూ సమగ్ర శిక్ష అనంతపురం జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ (ఏపీసి) ఉత్తర్వులను గురువారం జారీ చేశారు.
సూర్య ప్రతినిధి: పెన్నయ్య గుమ్మగట్ట మండల రిపోర్టర్