ప్రతి కుటుంబానికి భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా
ఆమనగల్లు, మేజర్ న్యూస్
ప్రతి కుటుంబానికి ఒక భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకమని ఎంపీడీవో జయరాం విజయ్ అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం కార్యక్రమాన్ని శుక్రవారం మండల పరిధిలోని ఆకుతోటపల్లి గ్రామంలోనిగ్రామపంచాయితీ భవనం వద్ద ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమానికి మండల స్థాయిఅధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో కోరారు. అనంతరం ఈనెల 21 నుండి మండలంలోని మిగతా అన్ని గ్రామ పంచాయతీలలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్నిప్రారంభించనున్నట్లు ఎంపీడీవో జయరాం విజయ్ చెప్పారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.రంగారెడ్డి జిల్లా.