BREAKING
పిల్లల భద్రత సినిమాతోనే ఆగిపోకూడదు అన్న విద్యా బాలన్ భారీ హంగులు, ఫ్రాంచైజీలకు మించి చిన్న సినిమాలకు చోటు కల్పించాలి- అభినయ్ డియో కొత్త ఏఐసీసీ కార్యదర్శుల నియామకం.. తెలంగాణకు సచిన్ సావంత్, సైమన్ అలెక్స్ ఆలయాల్లో సిరమ్మ ప్రత్యేక పూజలు... ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు ప్రారంభం.. సింహాద్రిపురంలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి! ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు.. ఎంపీటీసీల మెజారిటీతోనే రాజీ ప్రయత్నాలు! ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నగారా.. ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు.. ఎంపీటీసీ మెజారిటీలతోనే రాజీ ప్రయత్నాలు! 'అక్వాన్' ఎఫెక్ట్: ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్.. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇళ్లలో ఈడీ మెరుపు సోదాలు కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన తలారి రంగయ్య సిద్దిపేట గడ్డపై రేవంత్ గర్జన! బీఆర్ఎస్ పాలనపై విమర్శల వర్షం.. ప్రతి కుటుంబానికి భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా

ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు ప్రారంభం..

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు ప్రారంభం..

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం (నవంబర్ 20) నుంచి భవానీ మండల దీక్షలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక శుద్ధ ఏకాదశి శుభదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చక స్వాములు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, దీక్షాధారులకు మాలధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రికి చేరుకుని భవానీ మాలలు ధరిస్తున్నారు.

దేవస్థానం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. నేటి నుంచి నవంబర్ 24వ తేదీ వరకు మండల దీక్షల మాలధారణ కొనసాగుతుంది. అనంతరం డిసెంబర్ 10 నుంచి 14 వరకు అర్ధమండల దీక్షలు, డిసెంబర్ 30 నుంచి జనవరి 3వ తేదీ వరకు దీక్షల విరమణ కార్యక్రమాలు జరగనున్నాయి. జనవరి 3న ఉదయం 10 గంటలకు నిర్వహించే మహా పూర్ణాహుతితో భవానీ దీక్షల ఉత్సవాలు ముగుస్తాయి.

భారీ సంఖ్యలో తరలివచ్చే భవానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెప్పుల స్టాండ్లు, లగేజీ కౌంటర్లు, క్యూలైన్లలో భద్రతతో పాటు బంగారు, వెండి ఆభరణాల సమర్పణ కోసం ప్రత్యేక కౌంటర్లను అందుబాటులోకి తెచ్చారు. ఉత్సవాల వివరాల కోసం భక్తులు దేవస్థానం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 9099 ను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.