BREAKING
కొత్త ఏఐసీసీ కార్యదర్శుల నియామకం.. తెలంగాణకు సచిన్ సావంత్, సైమన్ అలెక్స్ ఆలయాల్లో సిరమ్మ ప్రత్యేక పూజలు... ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు ప్రారంభం.. సింహాద్రిపురంలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి! ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు.. ఎంపీటీసీల మెజారిటీతోనే రాజీ ప్రయత్నాలు! ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నగారా.. ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు.. ఎంపీటీసీ మెజారిటీలతోనే రాజీ ప్రయత్నాలు! 'అక్వాన్' ఎఫెక్ట్: ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్.. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇళ్లలో ఈడీ మెరుపు సోదాలు కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన తలారి రంగయ్య సిద్దిపేట గడ్డపై రేవంత్ గర్జన! బీఆర్ఎస్ పాలనపై విమర్శల వర్షం.. ప్రతి కుటుంబానికి భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కాపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సుబ్రహ్మణ్యం రాజు : వైసీపీ బలపరిచిన అభ్యర్థి పోటీకి సన్నద్ధం ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని వెల్లడి వెల్దుర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా...సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఇ.పుష్పావతి

నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన తలారి రంగయ్య

Select Suryaa Now
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన తలారి రంగయ్య

అనంతపురం నగరంలోని చిన్మయ నగర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంట్రాక్టర్ హనుమంతప్ప నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ తలారి రంగయ్య ముఖ్య అతిథిగా హాజరై హనుమంతప్ప కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన గృహంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమంతప్ప కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నూతన గృహంలో కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. సొంతింటి కలను సాకారం చేసుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన సందర్భమని, కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంట్లో ఆనందంగా జీవించడం మధురమైన అనుభూతిని కలిగిస్తుందని తలారి రంగయ్య పేర్కొన్నారు. హనుమంతప్ప కుటుంబం భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని, కుటుంబంలో ప్రేమానురాగాలు, ఐకమత్యం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. తమ ఆహ్వానం మేరకు గృహప్రవేశ వేడుకకు విచ్చేసి కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ తలారి రంగయ్యకు హనుమంతప్ప కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని హనుమంతప్ప కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.