BREAKING
కొత్త ఏఐసీసీ కార్యదర్శుల నియామకం.. తెలంగాణకు సచిన్ సావంత్, సైమన్ అలెక్స్ ఆలయాల్లో సిరమ్మ ప్రత్యేక పూజలు... ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు ప్రారంభం.. సింహాద్రిపురంలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి! ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు.. ఎంపీటీసీల మెజారిటీతోనే రాజీ ప్రయత్నాలు! ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నగారా.. ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు.. ఎంపీటీసీ మెజారిటీలతోనే రాజీ ప్రయత్నాలు! 'అక్వాన్' ఎఫెక్ట్: ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్.. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇళ్లలో ఈడీ మెరుపు సోదాలు కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన తలారి రంగయ్య సిద్దిపేట గడ్డపై రేవంత్ గర్జన! బీఆర్ఎస్ పాలనపై విమర్శల వర్షం.. ప్రతి కుటుంబానికి భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కాపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సుబ్రహ్మణ్యం రాజు : వైసీపీ బలపరిచిన అభ్యర్థి పోటీకి సన్నద్ధం ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని వెల్లడి వెల్దుర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా...సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఇ.పుష్పావతి

కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన

Select Suryaa Now
కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన

హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో (కేయూ) అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్‌లో నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఆరోపిస్తూ విద్యార్థులు యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద బైఠాయించి నిరసనకు దిగారు.

పౌష్టికాహార లోపం మరియు నాణ్యత లేని భోజనం కారణంగా సుమారు 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆందోళనకారులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు, అర్ధరాత్రి వేళ గేట్ ఎదుట నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. హాస్టల్ మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించాలని, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.