BREAKING
కొత్త ఏఐసీసీ కార్యదర్శుల నియామకం.. తెలంగాణకు సచిన్ సావంత్, సైమన్ అలెక్స్ ఆలయాల్లో సిరమ్మ ప్రత్యేక పూజలు... ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు ప్రారంభం.. సింహాద్రిపురంలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి! ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు.. ఎంపీటీసీల మెజారిటీతోనే రాజీ ప్రయత్నాలు! ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నగారా.. ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు.. ఎంపీటీసీ మెజారిటీలతోనే రాజీ ప్రయత్నాలు! 'అక్వాన్' ఎఫెక్ట్: ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్.. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇళ్లలో ఈడీ మెరుపు సోదాలు కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన తలారి రంగయ్య సిద్దిపేట గడ్డపై రేవంత్ గర్జన! బీఆర్ఎస్ పాలనపై విమర్శల వర్షం.. ప్రతి కుటుంబానికి భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కాపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సుబ్రహ్మణ్యం రాజు : వైసీపీ బలపరిచిన అభ్యర్థి పోటీకి సన్నద్ధం ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని వెల్లడి వెల్దుర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా...సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఇ.పుష్పావతి

ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు.. ఎంపీటీసీ మెజారిటీలతోనే రాజీ ప్రయత్నాలు!

Select Suryaa Now
ఏకగ్రీవం దిశగా ఆ రెండు పంచాయతీలు..  ఎంపీటీసీ మెజారిటీలతోనే రాజీ ప్రయత్నాలు!

చిట్టమూరు మేజర్ న్యూస్

మండలంలోని రెండు పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందా..లేక ప్రధాన పార్టీల మధ్య ప్రత్యక్ష పోటీ తప్పదా..ప్రస్తుతం మండల రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎంపీటీసీ ఎన్నికల్లో సాధించిన మెజారిటీలను ప్రాతిపదికగా చేసుకుని స్థానిక నాయకత్వం పంచాయతీ ఎన్నికల్లో రాజీ ప్రయత్నాలకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక సెగ్మెంట్‌లో సుమారు 700 ఓట్ల మెజారిటీ,మరో సెగ్మెంట్‌లో సుమారు 500 ఓట్ల మెజారిటీ సాధించిన నేపథ్యంలో ఆయా పంచాయతీల్లో రాజకీయ సమీకరణాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ రెండు పంచాయతీల్లోనూ బలమైన ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఉండటంతో రాజీ ప్రయత్నాలు అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు,ఇప్పటివరకు ఓటమి ఎరుగని రాజకీయ నేపథ్యం కలిగిన వారిని తెలుగుదేశం పార్టీలో ఓ నాయకుడు అనతికాలంలోనే బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం కూడా ఈ పరిణామాల్లో కీలకంగా మారింది.అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పేదలకు అందుబాటులో ఉంటూ రాజకీయాలు కొనసాగిస్తున్న ఆయన ప్రభావం రాజీ ప్రయత్నాలకు సానుకూలంగా మారుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా,ఆ రెండు పంచాయతీల్లో సగానికి ఒకటి తక్కువ వార్డు సభ్యుల స్థానాలతో పాటు ఉపసర్పంచ్ పదవిని ఆశిస్తూ రాజీ ప్రతిపాదనలు తెరపైకి వచ్చినట్లు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ ప్రతిపాదనలకు ఇరుపక్షాలు అంగీకరిస్తాయా.. అధినాయకత్వం నుంచి పచ్చజెండా లభిస్తుందా..అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎంపీటీసీ ఎన్నికల్లో సాధించిన మెజారిటీ పంచాయతీ ఎన్నికల్లో రాజీకి బలమైన పునాదిగా మారుతుందా..ఆ రెండు పంచాయతీలు ఏకగ్రీవం దిశగా అడుగులు వేస్తాయా..లేక పోటీకి సిద్ధపడతాయా.. అన్నది వేచి చూడాల్సిందే!

అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్