BREAKING
సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం 10 రోజుల పాటు పార్కు మూసివేత ఆకాశంలో ఓ కొత్త తార.. వెలుగుల విందుతో కనువిందు చేసిన ఉల్కాపాతం! ప్రత్యేక ఓటరు జాబితా సవరణను రద్దు చేయాలి చింతలమానేపల్లి లో చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ సైబర్‌ సెక్యూరిటీపై గీతంలో ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ఉక్కు మహిళ ఇందిరా గాంధీ సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం: పి. విజయా రెడ్డి ఏకలవ్య ఎరుకల సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 22న తెలంగాణ రాష్ట్ర యువజన సదస్సు ఇందిరమ్మ  సేవలు చిరస్మరణీయం : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సేవాలాల్ జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఆహ్వానం ఎంపీపీ ఎన్నికపై గంట గంటకూ ఉత్కంఠ! పాలసీదారుడి జన్మదినాన్ని సేవా వేడుకగా మార్చిన ఎల్‌ఐసీ సలహాదారు కౌటికె విఠల్ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా:ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇదేందయ్య సామి ! మీ వేడుకలకోసం రోడ్లు మూసేస్తారా...

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా:ఎమ్మెల్యే కాలే యాదయ్య

Select Suryaa Now
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా:ఎమ్మెల్యే కాలే యాదయ్య

నవాబు పేట్, మేజర్ న్యూస్: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. శుక్రవారం నవాబుపేట మండలం మాదిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేయాదయ్య మాట్లాడుతూ.. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోని కారణాలతో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం కల్పించనున్నట్లు తెలిపారు.కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహించే 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల సభ్యుడిని బీమా పరిధిలోకి తీసుకుంటారని, ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రాల ఆధారంగా వివరాలు సేకరిస్తారని వివరించారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ పథకం కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.ఈ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆపద సమయంలో ఆర్థిక అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాలే యాదయ్య కోరారు.