BREAKING
నూతన చేయుత పెన్షన్లను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం 10 రోజుల పాటు పార్కు మూసివేత ఆకాశంలో ఓ కొత్త తార.. వెలుగుల విందుతో కనువిందు చేసిన ఉల్కాపాతం! ప్రత్యేక ఓటరు జాబితా సవరణను రద్దు చేయాలి చింతలమానేపల్లి లో చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ సైబర్‌ సెక్యూరిటీపై గీతంలో ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ఉక్కు మహిళ ఇందిరా గాంధీ సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం: పి. విజయా రెడ్డి ఏకలవ్య ఎరుకల సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 22న తెలంగాణ రాష్ట్ర యువజన సదస్సు ఇందిరమ్మ  సేవలు చిరస్మరణీయం : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సేవాలాల్ జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఆహ్వానం ఎంపీపీ ఎన్నికపై గంట గంటకూ ఉత్కంఠ! పాలసీదారుడి జన్మదినాన్ని సేవా వేడుకగా మార్చిన ఎల్‌ఐసీ సలహాదారు కౌటికె విఠల్ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా:ఎమ్మెల్యే కాలే యాదయ్య

పాలసీదారుడి జన్మదినాన్ని సేవా వేడుకగా మార్చిన ఎల్‌ఐసీ సలహాదారు కౌటికె విఠల్

Select Suryaa Now
పాలసీదారుడి జన్మదినాన్ని సేవా వేడుకగా మార్చిన ఎల్‌ఐసీ సలహాదారు కౌటికె విఠల్

 హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : వ్యాపార సంబంధాలకు మానవీయ విలువలు జోడిస్తూ ఎల్‌ఐసీ జీవిత బీమా సలహాదారు కౌటికె విఠల్ ఆదర్శంగా నిలిచారు. తన పాలసీదారుడు, సీల్‌వెల్ కార్పొరేషన్ చైర్మన్, ఎండీ బండారు సుబ్బారావు జన్మదినాన్ని పురస్కరించుకుని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద సుమారు వెయ్యి మందికి అన్నదానం నిర్వహించారు. సాధారణంగా జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరుపుకోవడం ఆనవాయితీ. అందుకు భిన్నంగా ఓ పాలసీదారుడి పుట్టినరోజును నిరుపేదల ఆకలి తీర్చే కార్యక్రమంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆసుపత్రికి వచ్చిన రోగుల సహాయకులు, పేదలకు నిర్వాహకులు స్వయంగా భోజనాలు వడ్డించారు.

ఎల్‌ఐసీ సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రభాత్ కుమార్ సాహు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలసీదారుడి జన్మదినాన్ని సామాజిక సేవకు వేదికగా మార్చడం అభినందనీయమని కొనియాడారు. కౌటికె విఠల్ మాట్లాడుతూ..తమపై నమ్మకం ఉంచిన పాలసీదారులు, వారి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ అన్నదాన కార్యక్రమం తనకు ఎంతో ఆత్మసంతృప్తినిచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసీ అధికారులు, సిబ్బంది, ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.