చింతలమానేపల్లి లో చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ
సూర్య చింతలమానేపల్లి:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల గ్రామంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ 42 పత్రాలను స్థానిక సర్పంచ్ మేకల పోసాక్క పంపిణీ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, మండలం అధ్యక్షులు, కార్యదర్శి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు,లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.