BREAKING
ఉక్కు మహిళ ఇందిరా గాంధీ సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం: పి. విజయా రెడ్డి ఏకలవ్య ఎరుకల సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 22న తెలంగాణ రాష్ట్ర యువజన సదస్సు ఇందిరమ్మ  సేవలు చిరస్మరణీయం : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సేవాలాల్ జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఆహ్వానం ఎంపీపీ ఎన్నికపై గంట గంటకూ ఉత్కంఠ! పాలసీదారుడి జన్మదినాన్ని సేవా వేడుకగా మార్చిన ఎల్‌ఐసీ సలహాదారు కౌటికె విఠల్ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా:ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇదేందయ్య సామి ! మీ వేడుకలకోసం రోడ్లు మూసేస్తారా... పేద కుటుంబాల ఆర్ధిక భద్రత.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో యువత కీలక పాత్ర పోషించాలి: గవర్నర్ ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యం ప్రతినిధి హోదాకు భంగం కలిగిస్తే సహించేది లేదు. ఎమ్మెల్యే రవీంద్రభారతిలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

పేద కుటుంబాల ఆర్ధిక భద్రత.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి

Select Suryaa Now
పేద కుటుంబాల ఆర్ధిక భద్రత.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి
వెంగళరావునగర్, మేజర్ న్యూస్: దేశ  సమగ్రత  కోసం ప్రాణాలర్పించిన ఉక్కు   మహిళ, భారత తొలి మహిళా ప్రధానమంత్రి    భారత   రత్న శ్రీమతి ఇందిరా గాంధీ అని   ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ పి.వి. రవి శేఖర్ రెడ్డి అన్నారు.  దివంగత ఇందిరా గాంధీ   జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంగళరావునగర్ కాలనీ  సోషల్ వెల్ఫేర్  అసోసియేషన్, కాలనీ  సీనియర్ సిటిజెన్   అసోసియేషన్ సంయుక్తంగా   నిర్వహించిన కార్యక్రమానికి    డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ముఖ్య   అతిథిగా   హాజరై అక్కడ ఉన్న  చిత్ర పటానికి  పూలమాల  వేసి  ఘనంగా నివాళులు అర్పించారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఆ మహనీయురాలి జయంతిని   పురస్కరించుకొని సిద్దిపేట లో తెలంగాణ ముఖ్యమంత్రి    రేవంత్ రెడ్డి   చేతుల మీదుగా “ఇందిరమ్మ కుటుంబ జీవిత    బీమా పథకం”  ప్రారంభం కావడం  చాలా సంతోష  దాయకమన్నారు.  ప్రజల  సంక్షేమం,  పేద కుటుంబాల   ఆర్ధిక    భద్రత లక్ష్యంగా చేపడుతున్న ఈ   పథకం   నిరుపేద కుటుంబాలకు   భరోసాగా నిలుస్తోందని   ఈ సందర్భంగా డాక్టర్ రవి శేఖర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో వెంగళరావు నగర్ కాలనీ సోషల్ వెల్ఫేర్ అధ్యక్షులు ఎం. రంగారావు తో పాటు సభ్యులు, సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేషన్   అధ్యక్షులు  బాల కృష్ణ, సభ్యులు పాల్గొన్నారు.